ఎల్బీనగర్, వాయిస్ టుడే: జర్నలిస్టు, ఆర్.టి.ఐ కార్యకర్తగా పని చేస్తున్న రాపోలు లింగస్వామికి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. సమాజం మనకు ఏమిచ్చిందనేది కాకుండా సమాజానికి తనవంతు ఏమి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పేద కుటుంబంలో జన్మించిన రాపోలు లింగస్వామి చిన్ననాటి నుండి సమాజ సేవపై మక్కువ పెంచుకున్నారు. పేద ప్రజలకు తనవంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. రాపోలు లింగస్వామి సేవలను గుర్తించిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు ఆయనకు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పించింది. తాను అందించిన సేవలను ప్రప్రధమంగ గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్, టి.ఆర్.వి.ఎస్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థలకు రాపోలు లింగస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ ఓ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.