గులాబీ రంగు కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

నిజమాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థితో నామినేషన్ వేయించేందు ఎమ్మెల్సీ కవిత గులాబీ రంగు కారు డ్రైవర్గా మారారు. శుక్రవారం రోజు రెండవ సెట్ నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్సీ కవితతో కలిసి అంబాసిడర్ కారులో ఎమ్మేల్యే గణేష్ గుప్తా ర్యాలీగా బయలు దేరారు. కవిత స్వయంగా కారును నడిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పథకాల వల్ల గెలుపు ఖాయమన్నారు. మూడవసారి ముఖ్యమంత్రి అయ్యే రికార్డ్ కేసీఆర్కి దక్కుతుందని కవిత జోస్యం చెప్పారు. ప్రజల ఆదరణ ప్రేమ వల్ల గెలుపు ఖాయమన్నారు. నిజామాబాద్ నగరం ఆనాడు ఎట్లా ఉండేది?.. ఈ రోజు ఎలా అయిందనే ఆలోచన చేయాలన్నారు. ఇక్కడ కల్పించిన శాంతి భద్రత వాతావరణం వల్ల అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వచ్చాయన్నారు. 54 ఏళ్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఎనాడూ నిజామా బాద్కు చేసిందేమీ లేదన్నారు. ఆరుసార్లు బీజేపీకి అవకాశం ఇచ్చిన నిజామాబాద్కు చేసింది ఏమీ లేదని, కాబట్టి ప్రజలు ఆలోచించి బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలని కవిత విజ్ఞప్తి చేశారు.

A poem driven by a pink car
A poem driven by a pink car
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular