Sunday, September 8, 2024

ఒకటిరెండు రోజుల్లో రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా.. నీలం మధు ముదిరాజ్…

- Advertisement -
A political decision will be announced in a day or two.
Neelam Madhu Mudiraj…

ఒకటిరెండు రోజుల్లో రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా..
నీలం మధు ముదిరాజ్…
సోమవారం చిట్కుల్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు…
భారీగా హాజరైన కార్యకర్తలు….

తనను నమ్మి తన వెంట నడుస్తున్న కార్యకర్తల అభీష్టం మేరకే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని నిర్ణయం తీసుకుంటానని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.
ఈ సందర్భంగా భవిష్యత్తులో వచ్చే రాజకీయ పరిణామాలు, నిర్ణయాలపై కార్యకర్తల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నీలం మధు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను నమ్మి నా వెంట నడిచిన కార్యకర్తల ఋణం తీర్చుకోలేనిదన్నారు.పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో తనకు మద్దతు నిలిచి తన వెంట నడిచిన కార్యకర్తల మేలు మరిచిపోలేనిదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లోకి వెళ్లి 50 వేలకు దగ్గరగా ఓట్లను సంపాదించి ప్రజల హృదయాలను గెలుచుకోవడం కార్యకర్తల ద్వారానే సాధ్యపడిందని తేల్చి చెప్పారు. మన కార్యకర్తల భవిష్యత్తు కోసం, మన ప్రజలందరి బాగు కోసం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకే నా ఊపిరి లాగా నాతో ఉంటున్న మీ అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. మీరు అందరూ దూర దృష్టితో ఆలోచించి, ప్రజలకు మరింత సేవ చేసి అండగా నిలబడేలా మన కార్యాచరణ రూపొందించుకుందామని కోరారు. నా ప్రాణ సమానమైన మీ అందరి నిర్ణయమే నాకు శిరోధార్యమని, మీ సలహాలు, సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఒకటిరెండు రోజుల్లో భవిష్యత్తు రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తానని ప్రకటించారు. అనంతరం సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ నీలం మధు ఏ నిర్ణయం తీసుకున్న స్వాగతిస్తామని తెలిపారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా మనల్ని నమ్మి మనవెంట నడిచిన ప్రజలకు మంచి జరిగేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్