Sunday, December 22, 2024

ఇంకా ఆగని ఆస్తి చిచ్చు

- Advertisement -

ఇంకా ఆగని ఆస్తి చిచ్చు

A property leak that hasn't stopped yet

విజయవాడ, అక్టోబరు 28, (వాయిస్ టుడే)
జగన్‌తో ఉన్న ఆస్తుల వివాదంలో అసలేం జరిగిందో వైఎస్ షర్మిల ఓ లేఖ ద్వారా వైఎస్ అభిమానులుకు తెలిపారు. అందులో అత్యంత కీలకమైన విషయాలు ఉన్నాయి.  కుటుంబ వ్యాపారాలకు జగన్  “గార్డియన్ ” మాత్రమేనని  ..  అన్నీ వ్యాపారాలు నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు  సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి  భాధ్యత అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం అన్నరు.  వైఎస్ఆర్ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికి,స్పష్టంగా తెలియచేశారని..  కేవీపీ రామచందరరావు  , వైవి సుబ్బారెడ్డి  , విజయసాయి రెడ్డి కి కూడా తెలుసని షర్మిల స్పష్టం చేశారు.  నాన్న బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా…భారతి సిమెంట్స్ అయినా… సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా… నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. ( ఒక్క సండూరు మినహాయించి ). రాజశేఖర్ రెడ్డి  బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా  చేతుల్లో లేదని షర్మిల లేఖలో తెలిపారు. వైఎస్ జగన్ గురించి ఆయన సోదరి షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ అంటే ప్రాణం అని స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆస్తి పంపకాల ఇష్యూపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సమస్యపై సుబ్బారెడ్డి తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. ఆయన ఎవరు? అని నిలదీశారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్లు తాగేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పదవులు ఇస్తే అనుభవిస్తున్నారన్న షర్మిల.. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు సాయి రెడ్డి కూడా మాట్లాడుతారు.. సాయి రెడ్డి కూడా ఆయన చేతిలోనే ఉన్నాడు కదా వ్యాఖ్యానించారు.వాళ్ల దగ్గర ఇంకా నిజాయితీ ఏమైనా ఉందా చూద్దాం అనుకున్నాను. వీళ్లందరికీ వైఎస్ఆర్ తెలుసు. ఆయన మనోభావాలు కూడా తెలుసు. అమ్మకు అర్థం కావాలి. నా వరకు నేను చెప్తున్నది నిజమని నేను ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి కూడా ప్రమాణం చేయాలి. వైఎస్ఆర్ బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు భారతి సిమెంట్స్‌లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాట ఉండాలన్నారు. ఇది ప్రమాణంగా చెప్తున్న’ అని షర్మిల స్పష్టం చేశారు.ఇచ్చిన మాట ఏమయ్యింది అని జగన్ అన్నను అడిగా. జగన్ నాన్నకు మాట ఇచ్చారు. ఈ లోకంలో నీ తరువాత పాప మేలుకోరేది నేనే అని జగన్ చెప్పాడు. డోంట్ వర్రీ డాడ్ అన్నాడు. ఇది నిజం అని నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా. వైవీ సుబ్బారెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలి. లేదా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలి. సుబ్బారెడ్డి అంటున్నాడు.. సాక్షికి, భారతి సిమెంట్స్‌కి వాళ్ల పేర్లు పెట్టుకున్నారట. అందుకే ఆ ఆస్తులు వాళ్లవే నట. అందులో నాకు హక్కు లేదట. జగన్ సొంతగా సంపాదించాడట’ అని షర్మిల వ్యాఖ్యానించారు.’ఆరోజు వాళ్ల పేర్లు పెట్టుకుంటే నేను అభ్యంతరం చెప్పలేదు. పేర్లతో ఏముంది అనుకున్నాను. అన్న ముచ్చట పడ్డాడు అనుకున్నాను. వాళ్ల పేర్లతో ఆస్తులు ఉంటే.. నిజంగా వాళ్లవి అవుతాయా? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్లలేదు అంటున్నారు. ఏ అన్న అయినా.. చెల్లెలు గిఫ్ట్ అంటే.. ఏ బంగారమో… చీరనో… గిఫ్ట్ ఇస్తారు. అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాట ఇస్తారా? ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదు.. నా హక్కు. నా హక్కు కాబట్టే నాకు ఇస్తామని అన్నారు’ అని షర్మిల వివరించారు’ఇవ్వాల్సిన భాధ్యత వాళ్లకు ఉంది కాబట్టి ఎంవోయూ రాశారు. ఎంవోయూ రాయమని నేను అడగలేదు. సరస్వతి సిమెంట్స్ ఈడీ అటాచ్‌లో లేదు. అందుకే సరస్వతి సిమెంట్స్ వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు. జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు.. ప్రతి ఇంట్లో ఉండే కహాని అంట. ఇంత సునాయాసంగా ఎలా మాట్లాడుతున్నారు. మీకు సెంటిమెంట్ లేదా? ఎమోషన్ లేదా? ఈ మాటలు ఎవరో అంటే పట్టించుకొనే దాన్ని కాదు. నా సొంత చిన్నాన్నా అంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చిన్నాన్న.. నా బిడ్డలు నీ ముందు పెరగలేదా? నా బిడ్డలను మీరు తాకలేదా?’ అని షర్మిల ప్రశ్నించారు.’దేవుడు అంతా చూస్తున్నాడు. అంతా గమనిస్తున్నాడు. వైసీపీ క్యాడర్‌కి నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్న.. 2019లో వైసీపీ ప్రభుత్వం 151 స్థానాలు గెలిచి ఏర్పడింది. ఇది అప్పుడు అఖండ విజయం. ఎలా సాధ్యం అయింది. ఎంతో మంది వైఎస్ఆర్ అభిమానులు అనుకుంటే వచ్చింది. ఎంతో కష్టపడితే… త్యాగాలు చేస్తే ఆ విజయం సాధ్యం అయింది. నేనే కాదు…అమ్మే కాదు..ఎంతో మంది త్యాగాలు చేశారు. నేను అమ్మ ఇద్దరం మా శక్తి కి మించి పని చేశాం’ అని షర్మిల భావోద్వేగానికి గురయ్యారు.’అమ్మకు మోకాళ్ల నొప్పులు ఉండేవి. బాధలు భరించి ఏడ్చుకుంటూ పార్టీ కోసం కష్టం చేసింది. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నన్ను పాదయాత్ర చేయమని అడిగితే చేశా. నన్ను ఆరోజుల్లో సూర్యుడు వరకు వెళ్లమని అన్నా కూడా వెళ్లే దాన్ని. ప్రాణాలను సైతం నేను లెక్క చేయలేదు. నాకు జగన్ అన్న అంటే ప్రాణం. వైసీపీనీ అడుగుతున్న.. నేను మీకు ఏం అన్యాయం చేశా.. ఒక్క కారణం చెప్పండి. మీకు ఏం అవసరం వస్తే అవసరానికి మించి తిరిగా’ అని షర్మిల వ్యాఖ్యానించారు.’సమైక్యాంధ్ర ఉద్యమం చేయమని అడిగితే చేశా. ఓదార్పు యాత్ర చేశా. బై బై బాబు అంటూ చేసిన క్యాంపెయిన్ దేశంలో పెద్దది. మీకు ఇన్ని చేస్తే… మీరు నాకు ఏం చేశారు? మీరు నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఇది అమ్మకు తెలుసు..అందరికీ తెలుసు. 5 ఏళ్లు మీరు రాసి ఇచ్చిన ఎంవోయూ నా చేతుల్లో ఉంది. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. నాకు అవసరం వచ్చినా… నేను బయట పెట్టలేదు. ఎంవోయూ బయటకు పోతే వైఎస్ఆర్ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారు. నాన్న పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు’ అని షర్మిల వివరించారు.’నాకు వేరే స్వార్థం ఉంటే నేను ఏదో ఒక మీడియా హౌజ్‌కి ఇచ్చేదాన్ని కదా. ఇవ్వాళ అందరి చేతుల్లో ఎంవోయూ ఉంది. దీనికి కారణం నువ్వు కాదా? సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడు. ఇది చూడటానికి నేను ఇంకా బ్రతికి ఉన్నానా అని విజయమ్మ ఏడుస్తుంది. బెయిల్ రద్దు చేసేందుకు.. నేను ఈ కుట్ర పన్నాను అంటున్నాడు. అందుకే కోర్టుకి తల్లిని ఈడ్చాడట. నీ లబ్ధి కోసం తల్లిని వాడుకుంటవా. వైఎస్ఆర్ చనిపోయాక… సీబీఐ ఛార్జ్ షీట్‌లో పేరు పెట్టించింది ఈ జగన్ కాదా? ఛార్జ్ షీట్‌లో పెట్టక పోతే.. బెయిల్ రాదని చేర్చిన మాట నిజం కాదా? నీ లబ్ధికి అమ్మా నాన్నలను వాడుకుంటారా?’ అని షర్మిల నిలదీశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్