ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి
A quick solution to the problems of public broadcasting should be shown
ప్రజావాణి ఫిర్యాదులు 32
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల,
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు, కలెక్టర్లు బి,ఎస్ లత గౌతమ్ రెడ్డి,కలసి స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 32, ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు,బి.ఎస్ లత గౌతమ్ రెడ్డి,ఆర్డీవోలు,మధు సుధను,జివాకర్ రెడ్డి,కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.