శ్రీశైల పుణ్య క్షేత్రంలో అరుదైన ఘటన
శ్రీశైలం
A rare incident at Srisaila Punya Kshetra
శ్రీశైలం పాతాళ గంగ రోడ్డు లో వజ్రాల గంగమ్మ దగ్గర నాగుపాము చంద్ర లింగాన్ని చుట్టుకొని ఉండటం కనిపించింది. నంద్యాల జిల్లా నల్లమల్ల అడవుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకునేం దుకు శివభక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుం టారు. శ్రీశైలంలో పాతాళ గంగ వద్ద చంద్ర లింగేశ్వర స్వామి ఉంది. అక్కడ ప్రతిరోజు భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యం లోనే ఆలయ ప్రాంగాణాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. అనంతరం ఓ పెద్ద నాగుపాము అక్కడికి వచ్చి చంద్ర లింగాన్ని చుట్టుకొని కనిపించింది. ఇది చూసిన భక్తులు మల్లికార్జుని వద్దకు వాసుకి స్వయంగా వచ్చిందని సంతోషం. వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న భక్తులు.. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఎగబడ్డారు.ఈ సంఘటనను కొందరు భక్తులు
తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది.



