- Advertisement -
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చట్టం తెచ్చి అమలు చేయాలి
A reservation law should be brought and implemented in the private sector
జాతీయ సోషలిస్ట్ కూటమి డిమాండ్
హైదరాబాద్ డిసెంబర్ 14
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చట్టం ప్రవేశ పెట్టి ఆమోదం తెలుపాలని జాతీయ సోషలిస్ట్ కూటమి డిమాండ్ చేసింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ జాతీయ కై దేశ వ్యాప్త ఉద్యమంలో భాగంగా శనిఉవారం అబిట్స్ లోని సుర్యలోక్ కాంప్లెక్స్ లో మేధావుల తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోషలిస్ట్ కూటమి జాతీయ చైర్మన్ యల్. జై బాబు మాట్లాడుతూ 1991గ్లోబలైజేషన్ అర్థక సంస్కర్ణ లు అమలు మూలంగా ప్రభుత్వ రంగం తగ్గిపోయి 90శాతం ప్రై వేట్ రంగం పెరిగిందన్నారు. ప్రై వెట్లో రిజర్వేషన్ లేకపోవటం మూలంగా రిజర్వేషన్ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుంది. 10శాతం కూడా లేని ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ సరిగ్గా అమలు జరగనందున ఇక్కడ అన్యాయమే జరిగిందన్నారు. ఉన్నది కూడా ప్రయివేట్ పరం గా మారే పరిస్థి ఉన్నందున త్వరగా ప్రై వేట్ లో రిజర్వేషన్ చట్టం అమలులోకి తేవాలని డిమాండ్ చేసారు. 1981సెన్సెస్ ప్రకారంఇప్పటికి రిజర్వేషన్ అమలు మూలంగా sc st లు 2లక్షల ఉద్యోగాలు కోల్పోయార ని 2024జనాభా ప్రకారం అమలు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగాల్లో కేంద్రం లక్షలు కోట్లు పెట్టుబడులు విత్ డ్రా చేయడం మూలంగా40% sc st ఓబీసీలు కోల్పోయరని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక భారీ ఉద్యోగాలు ప్రభుత్వరంగంలో లేనట్లేనని ప్రై వేట్ లో మాత్రమే ఈ అవకాశం ఉన్నందున నూతన చట్టంతెచ్చి న్యాయం అందించాలన్నారు.ఓసి లు 61.6%ఉద్యోగాల్లో సంపదలో 51.6%సమానత్వాన్ని దాటి ఉన్నారని ఎస్సిఎస్టి లు కలిపి 5% ఓబిసి లు 4%మాత్రమే ఉన్నారని ఎప్పటికి సామజిక ఆర్థిక అసమానతలు తొలగిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు -సమానత్వాన్ని ఎప్పటికీ కాపాడుతారో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చర్చ జరపాలన్నారు. ప్రశ్నిస్తే కక్ష గట్టి సోషల్ -పొలిటికల్ యాక్టివిటీస్ని క్రిమినల్ యాక్టివిటీస్ గా మార్చి సామజిక వేత్తలను అక్రమంగా జైల్లో పెడుతున్నారు ఇది అన్యాయం అన్నారు. నిమ్న జాతులను వివక్షతతో చూడడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం హక్కులు కాపాడుకునే స్వేచ్ఛ ఉందన్నారు.దేశం చైనాను మించి వృద్ధి రావాలంటే సూక్స్మ -చిన్న -మధ్య -భారీ పరిశ్రమలు ఏర్పాటు కు సదుపాయలు అందుబాటులోకి రావాలని. కులవృత్తులు బలోపేతం అవ్వాలని బ్యాంకులు పెట్టు బడులు గ్రామస్తాయి కి బలంగా సేవలు విస్తరించాలన్నారు. ప్రభుత్వ రంగసంస్థల్లో ల్లో . బ్యాంక్ ల్లో ఆర్థిక రంగాల్లో. చట్ట సభల్లో కార్పొరేట్ శక్తులు శాశిస్తున్నారని. రాజ్యాంగ అమలుకు అడ్డు పడుతున్నారన్నారు. 94శాతం అనార్గ్ నైస్డ్ ప్రజల సంక్షేమం ఆర్థిక రంగంతో ముడిపడి ఆర్డక రంగంలో ప్రజలంతా లబ్ది పొందు తున్నందున ప్రై వేట్ రంగం ఎంత పెరిగితే దేశం అంత అభివృద్ధి చెందుతుంది అందుకే చట్టభద్దత ఉన్న అన్ని ప్రై వేట్ సంస్థల్లో రిజర్వేషన్ అడిగే హక్కు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ప్రై వేట్ రంగాన్ని బ్యాలన్స్ చేసి చట్టం అందించాలని దీనిపై అన్నీరాజకీయ పార్టీలతో పార్లమెంట్లో చర్చ పెట్టాలని. ప్రభుత్వ -ప్రై వేట్ ఉద్యోగులకు నూతన పెన్షన్ఒకే విధానం తో చట్టం కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా భుక్య ప్రసాద్,నాయకత్వం లో తెలంగాణా రాష్ట్ర కమిటి ఏర్పడింది. ఈ సమావేశం లో జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు శ్రినివా గౌడ్,శ్రినివాస్ నాయుడు,పి. చర్చల్,కొమ్ము అధిరప్ప, ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర అద్యక్షులు అప్పల్ రాజు,సిహెచ్ బాల క్రిష్ణ, పి,వెంకట్ రావు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -