- Advertisement -
వాయిస్ టుడే కథనానికి స్పందన
వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కరెంట్ బల్బులు ఏర్పాటు
వాయిస్ టుడే ప్రతినిధి రాజన్న ఎల్లారెడ్డిపేట నవంబర్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిష్టంపల్లి లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కరెంటు బల్బులు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు రాత్రి వేళలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయం వాయిస్ టుడే ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగా పత్రిక కథనంలో ప్రచురించగా స్పందించిన అధికారులు కరెంటు బల్బులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వాయిస్ టుడే ప్రతినిధికి ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



