- Advertisement -
డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటోల బంద్
A state-wide auto strike on December 7
హైదరాబాద్ నవంబర్ 22
(; గత 11ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్ర భుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటోబంద్ నిర్వహిస్తున్న ట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్స్ జెఏసి కన్వీనర్ బి.వెంకటేశం తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స మయంలో మానిపెస్టోలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుం డా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా మో సం చేసిందని విమర్శించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గ డుస్తున్నప్పటికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం భాదకరమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం లెక్కలేనన్ని ధర్నాలు,ర్యాలీలు,వినతిపత్రా లు అందజేసిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆటోడ్రైవర్ల సమస్య ల పరిష్కారంలో నిర్లక్షం వహిస్తే గత బిఆర్ఎస్కు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని ఆయన హెచ్చరించారు.
- Advertisement -