Tuesday, April 22, 2025

విద్య బలోపేతానికే ఉద్దీపకం వర్క్ బుక్  

- Advertisement -

విద్య బలోపేతానికే ఉద్దీపకం వర్క్ బుక్  

A stimulating work book for education

-ఆశ్రమ పాఠశాల జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్ధ్యాలు లేవని గుర్తింపు.

-ఉద్దీపకం వర్క్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ

మణుగూరు
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థుల ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్థ్యాలు ఇంగ్లీషులో చదవడం రాయడం గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేసి విద్య పరంగా విద్యార్థులు బలోపేతం కావడానికి ఐటీడీఏ పీవో బి. రాహుల్ పట్టుబట్టి ఈ ఉద్దీపకములు రూపొందించడం జరిగిందని దానిని ఉపాధ్యాయులు క్రమ పద్ధతిలో విద్యార్థులకు బోధించి గిరిజన విద్య బలోపేతం కావడానికి కృషి చేయాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
బుధవారం మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గ్రామంలోని జిపిఎస్ పాఠశాలల్లో ఐటీడీఏ ద్వారా రూపొందించిన ఉద్దీపకము ఇంగ్లీష్, గణితం విద్యార్థుల వర్క్ బుక్ ను ఐటీడీఏ పీవో తో కలిసి విద్యార్థిని, విద్యార్థులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక వసతి సౌకర్యాలతో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలు, గురుకుల పాఠశాల, కళాశాలలు నెలకొల్పిందని, ఈ సంవత్సరం ప్రైవేట్ కళాశాలకు పాఠశాలలకు దీటుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందన్నారు. గిరిజన విద్యార్థిని విద్యార్థుల విద్య బలోపేతం కావడానికి ఈ ఉద్దీపకములు ఎంతో ఉపకరిస్తాయని సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతిరోజు పిల్లలకు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో బి రాహుల్ మాట్లాడుతూ ముఖ్యంగా జిపిఎస్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఇంగ్లీషులో చదవడం రాయడం గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయడంలో వెనుకబడుతున్నట్లు ఆకస్మిక తనిఖీలలో గ్రహించడం జరిగిందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే వంద రోజుల ప్రణాళిక ద్వారా ఈ ఉద్దీపకములు రూపొందించడం జరిగిందని అన్నారు. విద్యార్థిని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ వర్క్ బుక్స్ ను రూపొందించామని గణితంలో గణిత ప్రాథమిక స్థాయి సంఖ్యల నుండి కూడికలు గుణకారాలు తీసివేతలు బాగాహారాలు వాటికి సంబంధించిన అంశాలను బొమ్మల ద్వారా రూపొందించామని, ఉపాధ్యాయులు విద్యార్థులకు బొమ్మల ఆధారంగా చదువుకొని దానిలోని కృత్యాలను చేసుకోవడానికి అనుకూలంగా శ్రద్ధతో బోధించడానికి వంద రోజుల ప్రణాళికను వీటిలో సూచించామని, గిరిజన విద్యార్థులు వీటిని పూర్తిస్థాయిలో నేర్చుకోవడం ద్వారా ప్రాథమిక స్థాయిలోని ఇంగ్లీష్ గణిత సామర్థ్యాలను నేర్చుకోవడంలో సఫలీకృతులు అవుతారని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జిపిఎస్ పాఠశాలల్లో 5,598 మంది చదువుతున్న విద్యార్థుల్లో విద్య ఊహించలేనంతగా లేకపోవడంతో విద్యార్థులు వెలుగు నింపేందుకే ఈ ఉద్దీపక పుస్తకం రూపొందించామని, ఈ ఉద్దీపకం పుస్తకం వలన విద్యార్థుల్లో దీపం వెలుగు నింపడానికి ఈ పుస్తకం పుట్టుకొచ్చిందని, డిడి ఎ టి డి ఓ కొంతమంది టీచర్లు సహకారంతో 10 రోజుల కష్ట ఫలితమే ఈ ఉద్దీప పుస్తకం అని విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని విద్యను బలోపేతం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏటీడీఓ అశోక్ కుమార్, ఎంఈఓ స్వర్ణ జ్యోతి, ఎస్ సి ఆర్ పి గాంధీ, తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, హెచ్ఎం ముత్తయ్య, కార్యదర్శి దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్