
వేములవాడ పట్టణంలో వేకువజామున దొంగలు హల్చల్ చేశారు. భగవంత రావు నగర్ లోని పిల్లి శ్రీలత చిన్న కిరాణా కొట్టు నడిపిస్తూ జీవనోపాధి పొందుతోంది. సదరు మహిళ భర్త శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్ళగా, చిన్న కూతురు హైదరాబాదులో విద్యనుభ్యసిస్తుండగా సదరు మహిళా శ్రీలత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే శ్రీలత నివాసంలోకి వేకువజామున సుమారు నాలుగు గంటలకు రాడ్ తో అనుమానితుడు ఇంటి ఆవరణలోకి చొరబడ్డాడు. ఏదో శబ్దం అయినట్లుగా అనిపించి గృహిణి పిల్లి శ్రీలత బయటకు వచ్చింది. కాంపౌండ్ ఆవరణలోనే రాడుతో దాగి ఉన్న నిందితుడు ఒక్కసారిగా ఆమెపై రాడ్‌తో దాడికి యత్నించాడు. అప్రమత్తమైన సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటిస్తూ అరుపులు కేకలు వేసింది. పెనుగులాటలో సదర్ దొంగ మెడలోని బంగారు చైన్లు లాగేందుకు ప్రయత్నించగా పుస్తెలతాడు కింద పడిపోగా మరో ఏడు గ్రాముల బంగారం చైన్ మాత్రం నిందితుడు లాక్కెళ్లినట్టుగా బాధితురాలు తెలిపింది. సదరు దొంగ దాడి వ్యవహారం ఇంటి ఆవరణలో బిగించిన సీసీ కెమెరాలు దృశ్యాలు రికార్డు కావడంతో మహిళలపై దాడులకు ప్రయత్నిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వేములవాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.