Monday, December 23, 2024

కమలానికి కలిసి రాని కాలం

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 26, (వాయిస్ టుడే): తెలంగాణలో గెలుపు గుర్రం ఎక్కాలని ఉబలాటపడుతున్న బీజేపీలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.. కాషాయపార్టీలోకి వలస వచ్చిన పలువురు సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతూ … పార్టీ మారే యోచనలో ఉన్నారంటున్నారు .. దానికి తగ్గట్లే సదరు సీనియర్ నేతలు ఇంటర్నల్ గా భేటీలు అవుతూ.. తెగ చర్చించేసుకుంటున్నారంట… దాంతో వారు పార్టీలో ఉంటారా? పోతారా ? అన్న చర్చ నడుస్తోంది?… అసలింతకీ టీ బీజేపీలో ఈ పరిస్థితికి కారణమేంటి?

తెలంగాణలో ఎన్నికల ప్రచారం టాప్ గేర్లో నడుస్తోంది … హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ, కాంగ్రెస్ లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి .. ఆ క్రమంలో బీజేపీ హస్తిన పెద్దలు  కూడా ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని స్కెచ్ లు గీస్తున్నారు… జాతీయ నేతలంతా తెలంగాణ వైపే చూస్తుండటం అందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పవచ్చు … మోడీ, అమిత్ షా లైతే తెలంగాణ నేతలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేస్తూ..  స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

హస్తిన పెద్దల పట్టుదల అంతలా ఉన్నా  రాష్ట్ర పార్టీలో పరిస్థితులు వారికి అంతగా అనుకూలిస్తున్నట్లు కనిపించడం లేదు … కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ , విజయశాంతి కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు పేరుకి బీజేపీలో ఉన్నా గత కొంతకాలంగా సైలెంట్ మోడ్ పాటిస్తున్నారు … సదరు సీనియర్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, ఈటల రాజేందర్ కు పార్టీలో ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో సమావేశమయ్యారు.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్‌లో చేరడం సహా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని సీనియర్ నేతల బృందం ప్రకటించడంతో, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో తెలంగాణ బిజెపి పూర్తిగా గందరగోళంలో పడింది.

ఈ సీనియర్ల బృందంలో  విజయశాంతి, జి. వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ సహా మరో 25 మంది బీజేపీ నేతలు ఉన్నారని.. భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తున్నారని సమాచారం… మరో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి కూడా వారితో చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది… తాజాగా డీకే అరుణ సైతం బీజేపీపై అసంతృప్తితో తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుండటం విశేషం.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీకి చేటు తెస్తోందని … ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లిపోయాయని  బీజేపీ అసంతృప్తి నేతలు అంటున్నారు … కేసీఆర్‌ను ఓడించేందుకు ఏమీ చేయలేని బీజేపీలో ఏం చేస్తున్నామంటూ ప్రజలు అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు…  కొద్ది నెలల క్రితం పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్‌పై ఈ బృందంలోని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి … ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని నియమించారు. అది కూడా సదరు నేతల్లో అసంతృప్తిని మరింత పెంచిందంట..

పార్టీలోని ఒక నాయకుడు తన కోరిక తీర్చాలని హైకమాండ్‌ను బ్లాక్ మెయిల్ చేశాడు…  తనకు పదవి కోసం రాష్ట్ర పార్టీలో మార్పులు చేయించాడు.. అప్పటి నుండి ఇక్కడ బిజెపి దిగజారిపోయిందని రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు… చిన్న కోమటిరెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఈటల రాజేందర్ ను ఉద్దేశించేనంటున్నారు .. బీజేపీలో కిషన్ రెడ్డి హడావిడి తర్వాత ఈటల రాజేందర్ కాస్తో కూస్తో పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కనపడుతోంది … అయితే తెలంగాణ బీజేపీలో ఆయన్ను ఓ వలస నేతగానే చూస్తున్నారు నేతలు … ఆయనకు అధిష్టానం పెద్ద బాధ్యత కట్టబెట్టినా, స్థానిక నాయకులు ఆ స్థాయిలో గుర్తింపునివ్వడంలేదు … ఈటల పాల్గొంటున్న కార్యక్రమాలు కూడా ఎక్కడా ప్రచారానికి నోచుకోవడంలేదు… ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పదవి ఆశించి, ఏవేవో కామెంట్లు చేసి చివరకు సైలెంట్ అయ్యారు.

మరోవైపు బీజేపీ ఫస్ట్ లిస్టులో వివేక్, డీకే అరుణ వంటి వాటి పేర్లు పేర్కొన్నలేదు … దాంతో  సీనియర్లైన అసంతృప్తి నేతల పయనం ఎటో? .. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటో అన్న గుబులు కాషాయశ్రేణుల్లో వ్యక్తమవుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్