Sunday, September 8, 2024

జగనన్న కాలనీలపై విజిలెన్స్ విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలి

- Advertisement -

జగనన్న కాలనీలపై విజిలెన్స్ విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలి

-ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజా యాదవ్

నెల్లూరు

జగనన్న కాలనీలపై ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ వేసి వాస్తవాలను నీగ్గు తేల్చాలని,లేనిపక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని,అవసరమైతే కోర్టు మెట్లైనా ఎక్కుతామని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం టిడిపి అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ పేర్కొన్నారు.వెంకటాచలంలో గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఆదేశానుసారం మండల టీడీపీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాల పంపిణీలో భారీగా అవకతవకలు, లెవలింగ్ పేరిట రూ.కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ  టీడీపీ నేతలు నిరసన చేపట్టారు.తహసిల్దార్ కార్యాలయం ఎదుట జగనన్న కాలనీలలో ఇళ్లస్థలాల పంపిణీలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలను నీగ్గు తేల్చాలంటూ, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్ కు టీడీపీ సీనియర్ నాయకులు రావూరి రాధాకృష్ణమనాయుడు, మావిల్లపల్లి శ్రీనివాసులు నాయుడు, చల్లా నాగార్జున్ రెడ్డి, వల్లూరు రమేష్ నాయుడు, ఈపూరు సుబ్బారెడ్డి, రావూరి పద్మనాభ నాయుడు, ఈపూరు మురళీధర్ రెడ్డి, చాట్ల వెంకటసుబ్బయ్య, దువ్వూరు లక్ష్మమ్మ తోపాటు అనుబంధ సంఘాల నాయకులతో కలిసి  గుమ్మడి రాజా యాదవ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ మాట్లాడుతూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో  భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వెంకటాచలం మండలంలో జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ మాటున వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తన ఆవేదన వ్యక్తపరిచారు.మంత్రి కాకాణికి తెలిసే అతని అనుచరులు జగనన్న కాలనీలలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వ్యక్తం చేశారు.అనికేపల్లి, గొలగమూడి, నిడిగుంటపాళెం, వెంకటాచలం, ఎర్రగుంట ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలోని అన్ని గ్రామాల్లో వేసిన జగనన్న కాలనీలలో లెక్కకు మించినంత అక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా తెలియజేశారు. జగనన్న కాలనీలలో లెవెలింగ్ పేరిట రూ.కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు.
గతంలో వెంకటాచలం మండలంలో పనిచేసిన తహసీల్దార్ల్ లను భయపెట్టో, బెదిరించో, ఆశ చూపించో, ఇంకో విధంగా బానిసచేసొ ఇళ్ల స్థలాల పట్టాలపై ఇప్పుడు సంతకాలు పెట్టించుకుంటున్నారని,
ఆ పట్టాలపై నియమిత తేదీలు వేయకుండానే సంతకాలు చేయించుకొని వైసీపీ నాయకుల ఇళ్లల్లో పెట్టుకొని ఆ పట్టాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
నామం మాత్రం సభలో 1,2  పంచి మిగిలిన పట్టాలు వైసీపీ నాయకుల వద్దే పెట్టుకుని వారి ఇళ్లకు పిలిపించి డబ్బులు తీసుకొని పట్టాలు ఇవ్వడం దారుణం అని అన్నారు.
తాము ఎన్నో ఏళ్ల నుండి రాజకీయాలు చేస్తున్నామని,ఇలాంటి పనికిమాలిన దుర్మార్గమైన రాజకీయాలు చూడలేదన్నారు.
మంత్రి కాకాణి ఇలాకాలో జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలు, లెవెలింగ్ పేరిట రూ.కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలపై తక్షణమే స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను నీగ్గు తేల్చాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులదే అని అన్నారు.
అర్హత కలిగిన పేదలకు ఇళ్ల స్థలాలు అందించకుండా మొండి చేయి చూపించారుని చెప్పారు.జిల్లా ఉన్నతాధికారులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వెంకటాచలం మండలంలో వేసిన జగనన్న కాలనీలలో జరిగిన అవినీతి, అక్రమాలు, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలు, జగనన్న కాలనీలో జరిగిన లెవెలింగ్ పనులపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ వేసి అవినీతి, అక్రమాలను నీకు తేల్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్