- Advertisement -
ములుగు జిల్లాలో గ్రామాన్ని దత్తత తీసుకుంటా…
A village will be adopted in Mulugu district...
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్
ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో కలిసి లక్నవరం అందాలను తిలకించారు. తాను ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్ వెల్లడించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ. జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గవర్నర్ హామీ ఇవ్వడం చాలా అభినందనీయమని అన్నారు. గవర్నర్ పర్యటనకు సహకరించిన కలెక్టర్, పోలీసులు, ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుగు ప్రయాణంలో గవర్నర్ ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాను సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విషపురుగు కాటుకు గురైన కానిస్టేబుల్‌ను పరామర్శించారు.
- Advertisement -