Sunday, September 8, 2024

ఓ ఓటు.. ఎవరికి చేటు…

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 14, (వాయిస్ టుడే): తెలంగాణలో అందరి దృష్టి తెలుగుదేశం కేడర్ పైనే ఉంది . ఆ పార్టీ అభిమానులు ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో నన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీపీ అధ్యక్షుడు రాజీనామా చేసి మరి బిఆర్ఎస్ లో చేరారు. ఆయన స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు సైతం చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఎన్నికల అనంతరమే నూతన అధ్యక్షుడిని నియమిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఉన్న క్యాడర్ను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేయడం విశేషం.ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం బిజెపితో కలిసి జనసేన అడుగులు వేస్తోంది. ఏపీలో పొత్తులు ఉన్న దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో టిడిపి సపోర్ట్ చేయాలని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కోరుతున్నారు. అటు జనసేన అభ్యర్థుల సైతం చంద్రబాబు ఫోటోను వాడుకుంటున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అలాగని పాజిటివ్ గా కూడా స్పందించడం లేదు. అటు టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు రేవంత్ రెడ్డి కారణమన్న చర్చి నడుస్తోంది. ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలు టిడిపి శ్రేణులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతర్గతంగా ఆయన టిడిపి శ్రేణులను తన వైపు తిప్పుకుంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.భారతీయ జనతా పార్టీ సైతం ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది అంతర్గతంగా పవన్ ద్వారా టిడిపి శ్రేణులను ఆకర్షించాలన్నది వ్యూహంగా తేలుతోంది. తెలంగాణలో పొత్తులు వర్క్ అవుట్ అయితే.. ఏపీలో సైతం మార్గం సుగమం అవుతుందని.. చివరి నిమిషంలో అయినా తెలుగుదేశం పార్టీ దారిలోకి వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది. కానీ ఎక్కడ బాహటంగా మద్దతు తెలపాలని టిడిపిని ఇంతవరకు బిజెపి కోరలేదు. అయితే చంద్రబాబు బెయిల్ తదనంతర పరిణామాల నేపథ్యంలో.. చాలా రకాలుగా ప్రచారం జరిగినా.. టిడిపి నాయకత్వం మాత్రం ఎక్కడా నోరు తెరవడం లేదు.అటు అధికార బీఆర్ఎస్ సైతం టిడిపి విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాదులో జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేసరికి తన గొంతును సవరించుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై లోకేష్ కు సానుభూతి తెలిపారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నిన్నటి వరకు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేందుకే టిడిపి పోటీ నుంచి తప్పుకుందని చేసిన కామెంట్స్ జోలికి సైతం వెళ్లడం లేదు. చంద్రబాబు అరెస్టుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసమే నన్న చర్చ అయితే ప్రారంభమైంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.

A vote.. Whose hand...
A vote.. Whose hand…

చాపకింద నీరులా…

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబును ఒక కాంగ్రెస్ ముఖ్యుడు కలిశారని.. పరామర్శ పేరుతో రాజకీయ సలహాలు, సూచనలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టిడిపి మద్దతు ఉందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ ఇద్దరి నేతల కలయిక హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుత తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టిడిపి నాయకుడు. చంద్రబాబుకు నమ్మిన బంటు. తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపి నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. స్వల్పకాలంలోనే టిపిసిసి పగ్గాలు అందుకున్నారు. అయితే రేవంత్ కాంగ్రెస్ నాయకుడే కానీ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమితంగా అభిమానిస్తాయి. ఇప్పటికీ రేవంత్ చంద్రబాబు పట్ల విధేయత కనబరుస్తారు. అందుకే రేవంత్ రెడ్డి ని సీఎం చేసుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని టిడిపి పోటీ నుంచి తప్పుకుందన్న ప్రచారం ఉంది. ఇటువంటి తరుణంలో చంద్రబాబును కాంగ్రెస్ ముఖ్యుడు ఒకరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అది కూడా ఒక అర్ధరాత్రి అని తెలియడం మరింత ఆసక్తిని పెంచుతోందిప్రస్తుతం చంద్రబాబు అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు పలువురు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నేత కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సదరు నాయకుడికి చంద్రబాబు దిశ నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఏపీ రాజకీయాల కోసమే చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. ఏకకాలంలో కెసిఆర్ తో పాటు బిజెపికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు ఈ స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కీలకమని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి క్యాడర్ కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు టిడిపికి చెందిన బలమైన సామాజిక వర్గంతెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా ఎన్ని చేయాలో అంతగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రముఖుడు చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ ఇదంతా పరామర్శల పేరుతో తంతు పూర్తి చేసినట్లు బయట ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. అది పూర్తిగా చంద్రబాబు పుణ్యమేనని ప్రచారం చేసేందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటు ఓ సామాజిక వర్గం ఆరాటపడుతున్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్