బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కు ఘనంగా స్వాగతం

- Advertisement -

బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కు ఘనంగా స్వాగతం

నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీ జే పీ అభ్యర్థి   పోతుగంటి భరత్ ప్రసాద్  ప్రచార ప్రారంభ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ నుంచి
కారులతో ర్యాలీగా గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం హరిత హోటల్ దగ్గర బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మరియు గద్వాల్  జిల్లా బిజెపి అధ్యక్షులు రామచంద్ర రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షులు సుధాకర్ రావు  మరియు  దిలీపాచారి పలువురు సీనియర్ నాయకులు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మరియు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు గార్ల కు ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా భరత్ ప్రసాద్ గారిని పలువురు నాయకులు శాలువా పూలమాలలతో సత్కరించారు అనంతరం  నాయకులను కార్యకర్తలను పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.
=======================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular