కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కు ఘన స్వాగతం
A warm welcome to Union Minister Rammohan Naidu
ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ
విజయవాడ విమానాశ్రయంలో కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి ఎంపి కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. మంగళగిరి లోని టిడిపి ప్రధాన కార్యాలయానికి కేంద్రమంత్రి రామ్మోహన్ తో కలిసి ఎం.పి కేశినేని శివనాథ్ వచ్చారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి కేంద్రమంత్రి రామ్మోహన్, ఎం.పి కేశినేని శివనాథ్ నివాళులర్పించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కేంద్రమంత్రి రామ్మోహన్, ఎం.పి కేశినేని శివనాథ్ కలిసారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించి వారితో కేంద్రమంత్రి రామ్మోహన్, ఎం.పి కేశినేని శివనాథ్ మాట్లాడారు.