Sunday, September 8, 2024

మణికట్టుకు మరమనిషి! స్మార్ట్ వాచ్‌లోనూ చాట్ జీపీటీ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో చాట్ జీపీటీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్ బాట్ గత కొంతకాలంగా చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు దీనిని స్మార్ట్ వాచ్ తో ఇంటిగ్రేట్ చేసి క్రాస్ బీట్స్ సరికొత్త ఫీచర్లతో నెక్సస్ మోడల్ ను ఆవిష్కరిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్ వాచ్ లో తొలిసారిగి ఈ-బుక్ రీడర్ ను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
స్మార్ట్ వాచ్ మార్కెట్ బాగా పెరిగింది. అందులో ఉంటున్న అత్యాధునిక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కంపెనీల మధ్య పోటీ వాతావరణం కూడా బాగా పెరిగింది. తక్కువ ధరలతో పాటు కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ లను కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ బ్రాండ్ అయిన క్రాస్ బీట్స్ ఓ కొత్త స్మార్ట్ వాచ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దాని పేరు క్రాస్ బీట్స్ నెక్సస్. ఇది మన చాట్ జీపీటీ అనుసంధానంతో వస్తుంది. ఈ సాంకేతికతో మన దేశంలో అందుబాటులోకి వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ వాచ్ క్రాస్ బీట్స్ ప్రకటించింది.  ఇటీవల కాలంలో చాట్ జీపీటీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్ బాట్ గత కొంతకాలంగా చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు దీనిని స్మార్ట్ వాచ్ తో ఇంటిగ్రేట్ చేసి క్రాస్ బీట్స్ సరికొత్త ఫీచర్లతో నెక్సస్ మోడల్ ను ఆవిష్కరిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్ వాచ్ లో తొలిసారిగి ఈ-బుక్ రీడర్ ను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
ఈ స్మార్ట్ వాచ్ గురించి క్రాస్ బీట్స్ కో ఫౌండర్ అర్చిత్ అగర్వాల్ మాట్లాడుతూ ఒక గొప్ప ఉద్ధేశంతో సరికొత్త ఆవిష్కరణలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. చాట్ జీపీటీ అనుసంధానంతో వినియోగదారులకు మంచి అనుభూతిని ఈ స్మార్ట్ వాచ్ అందిస్తున్నారు. అంతేకాక కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని వినియోగించి స్మార్ట్ వాచ్ లను సరికొత్త లుక్ లో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.
క్రాస్ బీట్స్ నెక్సల్ ధర, లభ్యత..
ఈ స్మార్ట్ వాచ్ దీపావళికి ఇండియా లాంచ్ కానుంది. దీని ధర రూ. 5,999గా ఉంది. ఇది రెండు కలర్ ఆప్షన్లు బ్లాక్ అండ్ సిల్వర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ ఆఫర్ కింద రూ. 999ప్రీ ఆర్డర్ పాస్ ను కంపెనీ అందిస్తోంది. దీని ద్వారా డిస్కౌంట్ ను అందిస్తోంది. అంతేకాక గూడీస్ ను పొందుతారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్