- Advertisement -
ఇంస్టాగ్రామ్ లో రిల్స్ కోసం బైక్ పై స్టంట్ చేస్తూ యువకుడు మృతి
A young man died doing stunts on a bike for Instagram reelsకర్నూలు
కర్నూలు జిల్లా కోసిగిలో ప్రాణం తీసిన రీల్స్… ఇంస్టాగ్రామ్ లో లైకుల కోసం యువకులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు… ఇదే క్రమంలో ఒ యువకుడు బైక్ పై స్టంట్ చేస్తూనే, తన సెల్ ఫోన్ తో విడియో తీసుకుంటు… బైక్ అదుపు తప్పి మృతి చెందాడు… కన్నతల్లి కళ్ళముందే కన్న కొడుకు మృతి… ఇంస్టాగ్రామ్ లో రిల్స్ కోసం డ్రైవింగ్ చేస్తూ అదుపుతప్పి యువకుడు మృతి… రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువకులు… కోసిగి చెందిన ఆంజనేయ అనే యువకుడు ఉరుకుంద రోడ్డులో బైక్ పై వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న మహిళ కూలీల ఆటోను తప్పించబోయి అదుపుతప్పి తలకు బలమైన గాయం కావడంతో మృతి… కూలీల ఆటో లోనే మృతుడి ఆంజనేయ తల్లి ,చెల్లెలు, అందరూ చూస్తుండగానే ఆంజనేయ రోడ్డు మీద ప్రాణాలతో కోట్టుమిట్టు అడుతున్నాడు… తల్లి, చెల్లి కళ్ళముందే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయిన ఆ యువకుడిని చూసిన చూపరుల సైతం కంటతడి పెట్టారు… ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీసుకునే అలవాటు పెట్టుకున్న యువకుడు ఆంజనేయులు చిన్న వయసులోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు… ఇప్పుడు యువత సోషల్ మీడియా పిచ్చిలో పడి ప్రమాదవశాత్తు బైక్ పై స్టంట్ లు చేస్తూ అతివేగంగా వెళుతూ కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు…
- Advertisement -




