Monday, March 24, 2025

తిరుమల సేవలకు ఆధారే… ఆధారం

- Advertisement -

తిరుమల సేవలకు ఆధారే… ఆధారం

Aadhaar is the basis for Tirumala services

తిరుమల, నవంబర్ 29, (వాయిస్ టుడే)
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ముదస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా దర్శనం కోసం, గదుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుంది. అటువంటిది.. స్వామివారి దర్శనం కోసం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా తిరుమలకు చేరుకునే భక్తుల పాట్లు చెప్పనలవి కాదు.. దీంతో కొంత మంది భక్తులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సార్లు స్వామివారి దర్శనం పేరుతొ లక్షలు లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన భక్తులు కూడా ఉన్నారు. అయితే శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను నకిలీ ఐడీ కార్డ్స్ తో తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. దళారుల ఆగడాలకు అడ్డు కట్ట వేసేందుకు ఆధార్ ను పలుసేవలకు అనుసంధానం చేయనుంది. స్వామివారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో సమర్పిస్తున్న ఐడీ కార్డులు ఒకటేనా, కాదా అనే విషయం తెలుసుకునే వ్యవస్థ ఇప్పటి వరకూ లేదు. దీంతో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం టీటీడీ ఈఓ శ్యామలరావు దృష్టికి చేరుకుంది. దీంతో ఆయన ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలపై సమీక్ష నిర్వహించి ఐటీ విభాగంలో ఉన్న కొన్ని లోపాలను అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనం, వసతి గదుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు.స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇచ్చే వసతి గదుల కేటాయింపులో పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఒకే ఆధర్ నెంబర్, ఒకే మొబైల్ నంబరు, ఈ- మెయిల్ తో ఎక్కువగా వసతి గదులు బుక్ అయినట్లు గుర్తించారు. కరెంటు బుకింగ్లో ఇచ్చే గదులను రకరకాల గుర్తింపు కార్డులను చూపించి .. వాటిని తీసుకుని.. అవసరం అన్న భక్తులకు ఎక్కువ ధరకు తిరిగి అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగింది. ఫెషియల్ రికగ్నిషన్ వ్యవస్థని ఏర్పాటు చేయాలనీ.. ఆధార్‌ ను అన్ని సేవలకు అనుసంధానం చేయాలనీ భావిస్తోంది. ఇలా చేయడం వలన తిరుమల లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని భావిస్తోందిఇప్పటికే యూఐడీఏఐ ప్రతినిధులతో టీటీడీ సిబ్బంది సమావేశమయ్యారు. తిరుమలలోని శీవారి పలు సేవలకు ఆధార్‌ మను అనుసంధానం చేసే విషయంపై చర్చించారు. ఆధార్‌ చట్టం-2016 ప్రకారం సేవలు వినియోగించుకోవచ్చు అని.. అయితే దీని కోసం రెండు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని టీటీడీకి తెలియజేశారు యూఐడీఏఐ సిబ్బంది. అంటే ఆధార్‌ గుర్తింపునకు 40 పైసలు, ఈకేవైసీకి రూ.3.40 పైసలు టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంపై టీటీడీ బోర్డు ఆమోద ముద్ర వేయగా.. ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అంగీకరిస్తే ఆధార్ ను అనుసంధానం చేస్తూ సేవలు టిటిడీ వినియోగించే అవకాశం లభిస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్