ఆది పినిశెట్టి, అరివళగన్, 7G ఫిల్మ్స్, తెలుగు-తమిళ బైలింగ్వల్ మూవీ ‘శబ్దం’ ఫిబ్రవరి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్- ఆంధ్ర & తెలంగాణలో N సినిమాస్ ద్వారా రిలీజ్

- Advertisement -

ఆది పినిశెట్టి, అరివళగన్, 7G ఫిల్మ్స్, తెలుగు-తమిళ బైలింగ్వల్ మూవీ ‘శబ్దం’ ఫిబ్రవరి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్- ఆంధ్ర & తెలంగాణలో N సినిమాస్ ద్వారా రిలీజ్

Aadi Pinishetti, Arivalagan, 7G Films, Telugu-Tamil Bilingual Movie 'Shabdam' World Wide Grand Release on 28th February - Released by N Cinemas in Andhra & Telangana

‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజా మేకర్స్ ‘శబ్దం’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.  ఈ చిత్రం ఫిబ్రవరి 28, 2025న తెలుగు, తమిళం, కన్నడ  హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.‘వైశాలి’లో ‘వాటర్’  హారర్ ఎలిమెంట్‌ తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు అరివజగన్  ఈ సినిమాలో ‘సౌండ్’ అనే సూపర్ నేచురల్ ఫ్యాక్టర్‌గా ఉపయోగించారు.లక్ష్మీ మీనన్ ఈ సినిమాలో  హీరోయిన్. సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.7G ఫిల్మ్స్ శివ తమిళ చిత్ర పరిశ్రమలో 225 కి పైగా చిత్రాలను పంపిణీ చేసి ద్రౌపతి, రుద్ర తాండవం వంటి చిత్రాలను సహ నిర్మాతగా చేయడం ద్వారా ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఆయన ఇప్పుడు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటివరకు ఆది కెరీర్‌లో మొదటి భారీ బడ్జెట్ చిత్రం.  ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది, ప్రేక్షకులకు ‘హారర్’ స్టయిల్ లో కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు,  ఈ సినిమా ‘సౌండ్’ ఆధారంగా రూపొందినందున, ఈ చిత్రానికి అవుట్ స్టాండింగ్ ఆడియోగ్రఫీని  టి ఉదయ్ కుమార్ సమకూర్చారు.పోస్ట్ ప్రొడక్షన్ పనులుతుది దశకు చేరుకునాయి. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పొందేలా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి.  ఈ చిత్రం N సినిమాస్ ద్వారా ఆంధ్ర & తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్  కానుంది.
తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular