Sunday, September 8, 2024

ఆరేపల్లి ఓటు…  ఎవరికి చేటు

- Advertisement -

కరీంనగర్, నవంబర్ 16, (వాయిస్ టుడే ): మానకొండూరులో అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు సాగుతుంది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ.. ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని పెంచారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేగంగా పుంజుకోవడంతో.. రెండు పార్టీలు భయపడుతున్నాయి. బీజేపీ చీల్చే ఓట్లే.. ఎవరి కొంప ముంచుతుందని ఆందోళన చెందుతున్నారు. రసమయి బాలకిషన్ మాత్రం హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రసమయి గెలుపును అడ్డుకుంటావని కాంగ్రెస్ చెబుతుంది. ఇక్కడ నిశ్శబ్ద విప్లవం తమకే అనుకూలంగా ఉందని బీజేపీ అంటున్నారు. మొత్తానికి.. ఈ త్రిముఖ పోరులో ఎవరూ విజయం సాధిస్తారు.. ఇప్పుడు తెలుసుకుందాం…కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎస్సీ రిజ్వరుడు సీటు.. రసమయి బాలకిషన్ వరుసగా విజయం సాధిస్తూ.. వస్తున్నారు. హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో ముందుకు వెళ్తున్నారు. గత మూడు నెలల నుంచీ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు.

Aarepalli vote...  whose hand
Aarepalli vote…  whose hand

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత, జరిగిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. అంతేకాదు, దూకుడుగా ప్రచారం చేస్తున్నారు రసమయి. ప్రతిపక్షాలపై అంతే స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదని అంటున్నారు. అంతేకాదు, ఓ పాట పాడుతూ.. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. రసమయి అనుచరులు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్లో ఉన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారిపోయాయి. అయితే నేతలు మారినంత మాత్రం.. ఏమి కాదని కార్యకర్తలు ప్రజలు తనతో ఉన్నారని రసమయి అంటున్నారు. ఎక్కడ కూడా తగ్గదేలేదని అంటున్నారు. 50 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తానని, ఈసారి గెలుపుతో హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు రసమయి.ఇక కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి బరిలో ఉన్నారు. ఆయన కూడా మూడు నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేశారు. పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో, ఉత్సహాంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ పదేళ్లలో మానకొండూరులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మాటలు, పాటలతోనే కడుపు నింపారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు, అవినీతి అక్రమాలు ఈ నియోజకర్గంలో రాజ్యమేలుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమాతో ఉన్నారు. రసమయి కౌంటర్లు చేస్తూ ప్రచారం చేస్తున్నారు.మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహనకు బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అయితే, ఆరెపల్లి మోహన్ చీల్చే ఓట్లు, ఎవరి కొంప ముంచుతుందనే ఆందోళన చెందుతున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. రెండు పార్టీలు విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటుంటే, మధ్యలో దూరిన ఆరెపల్లి మోహన్.. ప్రచార స్పీడ్ ను పెంచారు. ఇక్కడ మాదిగ ఓటర్లు అధికంగా ఉండటంతో, ప్రధాని మోదీ ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ప్రకటన, తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తో్ంది బీజేపీ. ఈసారి మానకొండూరులో కాషాయ జెండా ఎగురవేస్తామన్న ధీమాలో ఉన్నారు బీజేపీ శ్రేణులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్