Friday, January 17, 2025

పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు

- Advertisement -

పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు

Abolition of property rights if children neglect their parents

హైదరాబాద్

తల్లిదండ్రుల సంరక్షణ పోషణ నైతిక చట్టపరమైన బాధ్యతగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల నైతిక బాధ్యత మాత్రమే కాదు, న్యాయప రమైన బాధ్యత కూడా అని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం లో పునరుద్ఘాటించింది.
తల్లిదండ్రులను కాపాడు కోవడం ఆర్థిక బాధ్యత మాత్రమే కాదు, సామాజిక, నైతిక బాధ్యత అని, దానిని నెరవేర్చడం పిల్లల బాధ్యత అని కోర్టు పేర్కొంది. ఆ బాధ్యతను విస్మరించిన కూతురు, కుమారులకు తల్లిదండ్రుల ఆస్తిని పొందే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది.
వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీనిచ్చి, వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు ఇచ్చిన మాట తప్పడంతో ఓ కన్న తల్లి కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన జస్టిస్‌ సి.టి.రవికుమార్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసింది. అనంతరం ఆస్తి పై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం అండగా నిలుస్తుం దంటూ పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు. కన్నవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని పేర్కొంది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి వాళ్లకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని న్యాయస్థానం స్పష్టంచేసింది.
తద్వారా వృద్ధులైన తల్లి దండ్రులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది. మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలంటూ తమపై కన్న కొడుకే నిద్రాక్షిణ్యంగా దాడి చేస్తున్నా డంటూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తార్‌పుర్‌కు చెందిన ఓ మహిళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
అతనికి అప్పటికే గిఫ్ట్‌ డీడ్ గా కొంత ఆస్తిని ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్