Sunday, February 9, 2025

తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు

Accidents in Telugu states

హైదరాబాద్, విజయవాడ, జనవరి 28, (వాయిస్ టుడే)
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల (పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వీరికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు. ఈ క్రమంలో గ్యాస్ కొద్దికొద్దిగా లీకైంది.మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన వెంకటమ్మ.. గ్యాస్ లీకైన విషయం గమనించకుండా వంటగదిలో లైట్ వేసింది. దీంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించా యి. పేలుడు ధాటికి మిద్దె పైకప్పు కొంతభాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మతో పాటు దినేశ్ అనే పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బంధువులు సుబ్బమ్మ, రాయుడుతో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నారు.
మితిమీరిన వేగంతో..
అటు, తెలంగాణలోని వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. శివరాంపల్లి సమీపంలోకి రాగానే బైక్ ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొట్టి డివైడర్ వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకులు బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మణికొండలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి స్కూటీపై కూతురిని స్కూల్‌కు డ్రాప్ చేయడానికి వెళ్తుండగా.. యాక్టివాను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ కింద పడి కూతురు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రికి స్వల్ప గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ కింద పడి..
అటు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని వర్ణికి చెందిన యువకుడు బైక్‌పై తలమడుగు మండలం సుంకిడి నుంచి సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్