పాఠశాలను రాయించుకున్న నేరంపై చర్య
Action on Offense of School Enrollment
బద్వేలు వైకాపా నేతపై పోలీసు కేసు
బద్వేలు ఉదయం ప్రతినిధి
కడప జిల్లా సమీక్ష సమావేశంలో జరిగిన చర్చతో యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలయ్యాయి. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పరుగులు తీసి ఏకంగా పాఠశాలనే రాయించుకున్న వైకాపా నేతపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు పట్టా మార్పిడికి చర్యలు తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు రెవెన్యూ, పోలీసు అధికారులు పని చేసి కలెక్టర్ ఆదేశాలను పూర్తి చేశారు. బి.కోడూరు మండలం గోవిందాయపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్న సర్వే నంబరు 755లో 4.27 ఎకరాల భూమిపై వైకాపా కీలక నేత వెంకట సుబ్బారెడ్డి కన్ను పడింది. వైకాపా ప్రభుత్వం చివరి రోజుల్లో రెవెన్యూ అధికారులతో కూడబలుక్కుని తన భార్య కొండా వెంకటసుబ్బమ్మ పేరిట పాఠశాలను పట్టా చేయించుకున్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా భూమిని తాకట్టు పెట్టి రూ.8 లక్షలు డీసీసీబీలో రుణం సైతం తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, బాధ్యుడైన ఉప తహసీల్దార్ విద్యాసాగర్, వీఆర్వో గురవయ్య, సర్వేయర్ ప్రవీణ్‌కుమార్‌లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం డీఆర్సీలో మంగళవారం చర్చకు వచ్చింది. ఏకంగా పాఠశాలను సైతం వైకాపా నేత పట్టా చేసుకోవడంపై కలెక్టర్ శ్రీధర్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వ్యవహారంపై సమావేశంలోనే బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్‌తో కలెక్టర్ చర్చించారు. ఆ తర్వాత వెంటనే చర్యలు చేపట్టి ఇన్‌ఛార్జి తహసీల్దార్ ఎం.మధునాయక్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అక్రమానికి పాల్పడిన వైకాపా నేత దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వెంటనే వెంకట సుబ్బమ్మ పేరిట ఉన్న పట్టాను పాఠశాల పేరిట మార్పిడికి ప్రతిపాదనలు జేసీకి ఆర్డీవో పంపారు. డీసీసీబీ రుణాన్ని సైతం రికవరీ చేయడంతో రుణాన్ని మంజూరు చేసిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ కోసం రెవెన్యూ యంత్రాంగం మంగళవారం అర్థరాత్రి వరకు చేశారు వైసిపి హయాంలో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని బి కోడూరు మండలానికి చెందిన ఇద్దరు వైసిపి నాయకులు తమ పేరుతో రాయించుకున్నారు అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల ఉంది