సీనియర్ న్యాయవాది గంధం శివ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
Action should be taken against the police who assaulted senior advocate Gandham Siva
-తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు,న్యాయవాది ఇనుముల సత్యనారాయణ
మంథని
హన్మకొండ జిల్లాలో ప్రముఖ సీనియర్ న్యాయవాది గంధం శివ గారిపై హన్మకొండ ట్ర్రాఫిక్ సిఐ సీతారెడ్డి తో పాటు మరికొంతమంది పోలీసులు చేసిన దాడిని తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు,న్యాయవాది ఇనుముల సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.
సదరు న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా నానా దూర్భాషలు ఆడి వారిపైనే కేసు పెట్టడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.రాష్టంలో విధి నిర్వహణలో కొన్నిచోట్ల కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ నేతల ప్రసన్నం కోసం.. పోస్టింగ్స్ కోసం న్యాయవాదులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం సర్వ సాధారణం అయిందన్నారు. హన్మకొండ ట్రాఫిక్ సిఐ మరియు పోలీసులు చేసిన దాడిపై కేసు కూడా నమోదు చేసిన ప్రభుత్వం వెంటనే విచారణ కూడా జరిపించి సదరు సిఐ తో పాటు పోలీసులను సస్పెండ్ చేసి, భవిష్యత్లో న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇనుముల సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.