Friday, April 17, 2026

సైబర్ నేరగాడి అరెస్టు : డీసీపీ సాయి మనోహర్

- Advertisement -

సైబర్ నేరగాడి అరెస్టు
హైదరాబాద్

Arrest of Cyber ​​Criminal: Cyber ​​Crime DCP Sai Manohar
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన డిజిటల్ అరెస్ట్ లో నిందితుడిని అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు. నిందితుడు గజర్ల అవినాష్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 లక్షలు రికవరీ చేశాం. నిందితుడు సదానందం అనే బాలానగర్ కు చెందిన వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసి 42 లక్షలు కొట్టేశాడు. 15 రోజులు పాటు డిజిటల్ అరెస్ట్ చేసి  42 లక్షలు నాలుగు మ్యూల్ అకౌంట్ ల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. నిందితుడు అవినాష్ డేటా ఎంట్రీ జాబ్ కోసం  కంబోడియా వెళ్ళాడు. అక్కడ భారతీయులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడిన నెట్వర్క్లో చేరాడు. తర్వాత తానే స్వయంగా కంబోడియా నుండే సైబర్ మోసాలు చేయడం మొదలు పెట్టాడు. పిబ్రవరిలో బాలానగర్ లో ఉండే వృద్ధుడికి కాల్ చేసి మొబైల్ నెంబర్ పై 17 కేసులు ఉన్నాయని భయపెట్టాడు. సీనియర్ సిటిజన్ కాబట్టి ఇంట్లో విచారణ చెయ్యాలి అని భయపెట్టాడు. వీడియో కాల్ లో విచారణ పేరుతో మరో వ్యక్తి వచ్చి మీ మొబైల్ నెంబర్ అనేక వివాదంలో ఇరుక్కుంది అని భయపెట్టాడు . ఇలా బెదిరించి ఆ వృద్ధుడి వద్ద 42 లక్షలు నాలుగు అకౌంట్ లోకి మళ్ళించారు. కంబోడియాలో ఉంటూ అక్కడ వాళ్ళు కళ్ళగప్పి నిందితుడు అవినాష్ బాధితుడి డబ్బును తెలంగాణ ఏపీలో ఉన్న మ్యూల్ అకౌంట్ లోకి మళ్ళించారు. ఇదే కేసులో భాగంగా వైజాగ్, బాంబే కు వెళ్ళాము.. అంతకుముందు ఇదే కేసులో నలుగురిని అరెస్ట్ చేశాము. వారిని భిన్న కోణాల్లో విచారిస్తే అవినాష్ విషయం తెలిసింది. మార్చిలో అవినాష్  ఇండియాకు వచ్చాడు.. చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేశాము. అరెస్ట్ సమయంలో కమీషన్ కింద అతను తీసుకున్న 12 లక్షలు కూడా స్వాధీన చేసుకున్నాం..నిందితుడిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని అన్నారు.
డిజిటల్ అరెస్ట్ లో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద డబ్బును సీజ్ చేయడం ఇది మొదటి సారి..డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు.. ఇలాంటి మోసాల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్