జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ డిమాండ్
జోగులాంబ గద్వాల నవంబర్ 7: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భ ణినికీ వైద్యం అందించకుండా బయటకు పంపించడం…. అమే తండ్రి నీ మెడపట్టుకొని గెంటి వెయ్యడం…. చాలా దురదృష్ట కరమైన సంఘటన అని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలు ప్రజలకు వైద్యం చేసే విధంగా ఉండాలి కానీ ఆసుపత్రికి వచ్చే వాళ్ళని మనుషుల్ని పెట్టి బయటికి తోసే విధంగా ఉండకూడదని అన్నారు. ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. నిజానికీ…జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ దవాఖానా లో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా… ఉన్నా డాక్టర్లు సమయ పాలన పాటించారు…. ఎవరికి వారే ఏమున తీరే అనే రీతిగా…. ఎప్పుడు ఎవ్వరు వస్తారో… పోతారో అర్ధం కానీ పరిస్థితి నెలకొందన్నారు.తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలు కు అన్ని రకాలుగా వైద్యం ఉచితంగా అందించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది కానీ గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ లో జరుగుతున్న సంఘటనలు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది ఇక్కడ వైద్యం కోసం వచ్చిన ప్రజలను హాస్పిటల్ సిబ్బంది వెనికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని అనిపిస్తుంది !!! బహుశా ప్రవేట్ హాస్పిటల్స్ కు లాభం చేసే ప్రయత్నమా ? అంటే అవును అంటున్నారు. ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.



