- Advertisement -
టీటీడీ లో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం
Actions against pagan employees in TTD have started
తిరుమల
టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులపై ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో చర్యలు ప్రారంభం అయ్యాయి. అధికారులు టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను గుర్తించారు. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం, ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది
ఈ రోయజు అన్యమతాన్ని అభ్యసిస్తూ…భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారని గుర్తించారు. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే, టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు అదేశం జారీ అయ్యాయి. 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలో చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని అదేశం ఇచ్చారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -