- Advertisement -
జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలి
Actions should be taken without crackers shops in populated areas
అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు
హైదరాబాద్
దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం మొత్తం మరియు జంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న గల్లిల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైదారాబాద్ లో అబిడ్స్ తో పాటు యకత్ పుర లోని చంద్ర నగర్ లో టపాసుల దుకాణాలు వల్ల రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి… అదృష్టవశాత్తూ పెద్దగా ప్రమాదం జరగలేదు. టపాసుల దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ టపాసుల దుకాణాలని మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదారాబాద్ జిల్లా అధికారులను అదేశిస్తున్న. వెంటనే ఎక్కడైనా చిన్న చిన్న గల్లిల్లో జన నివాస ప్రాంతాల్లో, వ్యాపార ప్రదేశాల్లో ఎలాంటి టపాసుల దుకాణాలు నిర్వహించే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి. వాటికి ప్రత్యామ్నాయంగా హైదరాబాదులోని ఖాళీ ప్రదేశాలు, క్రీడా మైదానాలు, పాఠశాల టపాసులు దుకాణాలు వాడుకోవాలి. ఎక్కడైనా నివాస ప్రాంతాల మధ్య టపాసుల దుకాణాలు ఉంటే సంబంధిత ఏరియా అధికారి బాధ్యత వహించాలి. ప్రమాదాలు నివారించడానికి అందరి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కడైనా జనావాసా,లు నివాస సముదాయాల్లో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని కోరుతున్నానని అన్నారు.
- Advertisement -