కరాటే వేడుకల్లో పాల్గోన్న నటుడు సుమన్
సికింద్రాబాద్
Actor Suman participating in karate celebrations
తార్నాకలో బ్రూస్లీ షాటో ఖాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా 15వ వార్షికోత్సవ వేడుకలు, మెగా బెల్ట్ అవార్డింగ్ సెర్మనీ ఘనంగా నిర్వహించారు. సంస్థ ఫౌండర్ డైరెక్టర్ ఎన్. శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సుమన్, పోలీసు అధికారులు డిఎస్పి లకావత్ దేవలా నాయక్, జైళ్ల శాఖ సూపరెండెంట్ శివకుమార్ గౌడ్ తదితరులు హాజరై పలువురికి బెల్టులు, సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాను 11 సంవత్సరాల వయసు నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తన అనుభవాలను వివరించారు. కరాటేతో మెంటల్ ఆండ్ ఫిజిల్ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్తో పాటు దైర్యం, క్యారెక్టర్ నిర్మాణం చేసుకోవచ్చునన్నారు. విద్యతో పాటు క్యారెక్టర్ ఉంటేనే ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతామన్నారు. కరాటే మాస్టర్ ఎండకు, చలికి, వర్షానికి జడియ కూడదన్నారు. అవతలి నుంచి నలుగు వ్యక్తులు కొడితే తట్టుకునే శక్తి రావాలి అదే మార్షల్ ఆర్ట్స్. కరాటే ప్రత్యేక అన్నారు… సెక్యూలర్ ఆర్ట్ గేమ్ మార్షల్ ఆర్ట్ అన్నారు. కష్టపడి పెంచిన తమ తల్లిదండ్రుల పేరును చెడగొట్టే డ్రగ్స్ క్స్కు దూరంగా ఉండాలనీ యువతకు సూచించారు.