ప్రగతికి అడ్డా- అడ్డగుట్ట: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్    

- Advertisement -

సికింద్రాబాద్ నవంబర్ 3:  ఆసియాలోనే అతిపెద్ద స్లముగా ముద్రపడిన అడ్డగుట్టను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గత ఘనత తమదేనని అడ్డగుట్ట రూపాన్ని మార్చిన చరిత్ర కెసిఆర్ కు దక్కిందనిడిప్యూటీ స్పీకర్    సికింద్రాబాద్ నియోజకవర్గ  బీ ఆర్ ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్  అన్నారు.  సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తో కలిసి అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని వివిధ  ప్రాంతాల్లో  రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఇంటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకొని తమకు మద్దతు తెలపాలని అభ్యర్ధించారు. రియో పాయింట్, బుద్ధా నగర్, లోహియా నగర్, బోయ బస్తీ, మొండి బండ్ నగర్, మరాఠా బస్తీ, తుకారం గేటు తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం సాగింది.  ఈ సందర్భంగా స్థానికుల నుంచి పద్మారావు గౌడ్ కు  మంచి స్పందన  లభించింది. అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , కార్పొరేటర్, రాసురి సునీత,  బీఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్,  రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, అడ్డగుట్ట డివిజన్  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అడ్డగుట్ట లో మౌళిక సదుపాయాలను కల్పించిన ఘనత తమదే అని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో నిలిచేలా తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.  సీఎం కెసిఆర్ హ్యాట్రిక్ తో పాటు తాము కూడా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక గంగపుత్ర సంఘం నాయకులు ఆయనకు మద్దతు ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular