- Advertisement -
తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలు
Additional EV checks in Tirumala
తిరుమల,
తిరుమలలోని హెచ్.టి. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్.టి.షాపింగ్ కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ భగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్న ప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదనప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -