ప్రజా వినతులను నాణ్యతతో పరిష్కరించండి
Address public complaints with quality
సంతృప్తి చెందే స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
*పిజిఆర్ఎస్ లో స్వీకరించిన 199 ఫిర్యాదులు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల,
ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చి ఫిర్యాదు దారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందే స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వీకరించిన 18 దరఖాస్తులను పరిష్కరించాలని… ఇందులో మూడు దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సేవా సర్వీసులను కూడా క్లియర్ చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలన్నారు.
ఫిర్యాదుల స్వీకరణకు ముందు జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కార్యకలాపాలకు సంబంధించిన దస్త్రాలన్నీ ఈ – ఆఫీస్ ద్వారా సిగ్నేచర్ లేకుండా వస్తున్నాయని, ఈ – ఫైలింగ్ విధానంపై పూర్తిస్థాయి అవగాహన పొంది ప్రతి ఫైలు ఈ-ఆఫీస్ ద్వారానే రావాలన్నారు. రోజువారీ పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి అదేరోజు సాయంత్రంలోగా ప్రతికూల వార్తకు సంబంధించిన రీజయిన్డెడర్ పంపాలన్నారు. జిల్లాలోని మున్సిపల్ కమీషనర్లు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి పారిశుధ్యం, ఇతర మౌలిక వసతులపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా కింద ఈనెల 31 వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ముందుగానే నగదును డ్రా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల మొత్తం పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. 14 మండలాలలోని 48 చెంచుగూడెంలలో ఆధార్ లేక అనేక సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారని ఆధార్ లేని గిరిజనులకు నోటరీ లేకుండా జనన ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ, తాసిల్దారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే అపార్ ఐడి జనరేషన్ కొరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా జనన ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ సిబ్బందికి నిర్దేశించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు.
పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు
1) నంద్యాల పట్టణానికి చెందిన వెంకటరమణ బొమ్మలసత్రంలోని నందిపైప్స్ నందు తాను 1999 వ సంవత్సరం నుండి 2022 వ సంవత్సరం వరకు పని చేసానని… ఏ కారణం లేకుండా నన్ను విధుల నుండి తొలగించారని, నాకు 5 నెలల జీతం, పిఎఫ్ మొత్తాలు ఇంత వరకు రాలేదని సంబంధిత బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
2)శిరివెళ్ళ మండలం కామినేనిపల్లెలో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన పార్కింగ్ ప్రదేశంలో కొందరు అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించుకుని రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని అక్రమ షెడ్లను తొలగంచాలని కామినేనిపల్లే వాసులు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
3) ఆళ్లగడ్డ మండలం ఆర్.క్రీష్టాపురం గ్రామంలో దాదాపు 700 రేషన్ కార్డుదారులు ఉన్నారని వినియోగదారుల సౌకర్యార్థం మరో రేషన్ షాపు ఇవ్వవలసినదిగా కోరుతూ ఆర్.క్రీష్టాపురం గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
*ఇంకా ఈ కార్యక్రమంలో 199 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.