ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించండి.
Address public issues promptly.
పిజిఆర్ఎస్ కు 124 దరఖాస్తులు
జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
నంద్యాల, నవంబరు 25:-
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. పిజిఆర్ఎస్ లో ఇంకా పెండింగ్లో ఉన్న 774 ఫిర్యాదులను బియాండ్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలన్నారు. వచ్చేవారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉందని ఈలోగా ఫిర్యాదులన్నీ క్లియర్ కావాలని జెసి తెలిపారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీ రాజ్ ల, సివిల్ సప్లై, పోలీస్ తదితర శాఖలో అధిక సంఖ్యలో పెండింగ్ ఉన్నాయని ఆర్డీవోలు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలన్నారు. సీఎమ్ఓ కార్యాలయపు ఫిర్యాదులు కూడ 67 పెండింగ్ లో వున్నాయని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఏపీ సేవా సర్వీసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల రీసర్వే కి సంబంధించి సూచించిన నాలుగు ప్రొఫార్మా ల్లో వివరాలు పొందుపరిచి మంగళవారం సాయంత్రంలోగా అందజేయాలని ఆర్డిఓలు, తాసీల్దార్లను జెసి ఆదేశించారు.