సూర్యుడి అరుదైన చిత్రాలను క్లిక్‌మనిపించిన ఆదిత్య-ఎల్‌1

- Advertisement -

బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన  సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1.. తాజాగా కొన్ని అరుదైన చిత్రాలను పంపింది. భానుడి పూర్తి గోళాన్ని 200-400 నానోమీటర్ల తరంగ దైర్ఘ్య పరిధిలో తొలిసారి క్లిక్‌మనిపించింది. ఈ ఉపగ్రహంలోని సోలార్‌ అల్ట్రావయలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌) ఈ ఘనత సాధించింది. సౌరకుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయి అని ఇస్రో అభివర్ణించింది. 11 ఫిల్టర్లను ఉపయోగించి ఈ చిత్రాలను తీసినట్లు వివరించింది. సౌర మచ్చలు, సూర్యుడిలో ఒకింత ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు, భానుడి ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ల గురించి లోతైన అంశాలను తెలుసుకోవడానికి ఇవి సాయపడతాయని తెలిపింది.  ఆదిత్య-ఎల్‌1ను ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి ప్రయోగించారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌1 ప్రాంతం దిశగా దీని పయనం సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి అది తన గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో ఇటీవల తెలిపింది.

Aditya-L1 who clicked rare pictures of Surya
Aditya-L1 who clicked rare pictures of Surya
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular