Sunday, September 8, 2024

ఆదిత్య L1 మిషన్‌ విజయవంతం

- Advertisement -

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య

శ్రీహరికోట, సెప్టెంబర్ 2:  దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆదిత్య L1 మిషన్‌ని  లాంఛ్ చేసింది ఇస్రో. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. సరిగ్గా 11.50 నిముషాలకు రాకెట్ లాంఛ్ అయింది. రెండు దశలు విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ తరవాత అన్ని దశలూ దాటుకుని వెళ్లింది ఆదిత్య L1. చివరకు స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయినట్టు వెల్లడించింది. ఆదిత్య L1 తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని తెలిపింది.మొత్తం ప్రయోగ సమయం 53 నిముషాల వరకూ ఉండనుంది. ఆదిత్య L1ని క్రమంగా లగ్రాంజ్ పాయింట్‌లోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. మూడు దశలూ విజయవంతం అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం కీలకమైన నాలుగో దశపై ఉత్కంఠ కొనసాగుతోంది.  లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది. ఆదిత్య L1 నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో అక్కడి ప్రజలు భారత్ మాతా కీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇస్రోకి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. చంద్రయాన్ 3 సక్సెస్ తరవాత చేపట్టిన మిషన్ కావడం వల్ల అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి. సూర్యుడిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసే లక్ష్యంతో ఈ ప్రయోగం చేసింది ఇస్రో. చంద్రయాన్ 3 లో ఉన్నట్టే…ఈ ప్రయోగంలోనూ ఎన్నో సవాళ్లున్నాయి. వాటన్నింటినీ దాటుకుని గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో సైంటిస్ట్‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌లో అత్యంత కీలకమైన లగ్రాంజ్ పాయింట్‌ని చేరుకోడానికి 125 రోజుల సమయం పట్టనుంది.

adityas-l1-mission-was-successful
adityas-l1-mission-was-successful

ప్రయోగంతో ఎన్నో లాభాలు

వరుస ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది ఇస్రో. ఇప్పటి వరకూ ఏ దేశమూ చేరుకోలేని చంద్రుడి సౌత్‌పోల్‌పై అడుగు పెట్టి జెండా ఎగరేసింది. ఇప్పుడదే జోష్‌తో సూర్యుడిపైనా పరిశోధనలు చేయనుంది. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఆదిత్య L1 మిషన్‌ని విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రోకి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న PSLV ద్వారా ఈ ఉపగ్రహాన్ని పంపింది. ఇప్పటికే ప్రయాణం మొదలు పెట్టింది Aditya L1. 125 రోజుల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకోనుంది. అయితే…చంద్రుడిపై ప్రయోగం చేయడానికి కారణం…అక్కడ ఆక్సిజన్ ఉందా..? జనావాసానికి వీలుందా..? అని తెలుసుకోవడం కోసం. మరి సూర్యుడిని ఇస్రో ఎందుకు టార్గెట్ చేసింది..? అక్కడి వాతావరణంపై పరిశోధనలు చేస్తే మనకేంటి లాభం..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సూర్యుడి ఉపరితలంపై విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. 2.7 కోట్ల డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందని అంచనా. ప్లాస్మా ఎక్ల్‌ప్లోజన్ ( plasma explosion) వల్ల ఉపరితలం నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఈ పేలుడు కారణణంగానే…స్పేస్‌లోకి మిలియన్ టన్నుల ప్లాస్మా వ్యాప్తి చెందుతుంది. దీన్నే టెక్నికల్‌గా Coronal Mass Ejection (CME)గా పిలుస్తారు. కాంతివేగంతో సమానంగా ఈ ప్లాస్మా అంతరిక్షంలోకి విస్తరిస్తుంది. ఒక్కోసారి ఈ CME భూమి దిశగానూ దూసుకొస్తుంది. కాకపోతే..భూమికున్న గురుత్వాకర్షణ శక్తి వల్ల అది భూమిని తాకేందుకు వీలుండదు. కొన్ని సార్లు భూమి Outer Layerలోకి చొచ్చుకుని వచ్చింది. ఎప్పుడైతే CME భూమివైపు దూసుకొస్తుందో…భూ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలకు డ్యామేజ్ జరుగుతుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్‌పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికే ఇస్రో ఆదిత్య L1 మిషన్‌ని చేపట్టింది. దాని తీవ్రతను అంచనా వేయడానికి ఈ ప్రయోగం ఉపకరించనుంది.

adityas-l1-mission-was-successful
adityas-l1-mission-was-successful

సూర్యూడి రహస్యాలు విప్పేందుకు

చందమామను ముద్దాడిన ఇస్రో, సూర్యుడిని చేరుకునేందుకు సిద్ధమైంది. మండే సూర్యుడి రహస్యాల ఛేదనకు ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకను కాసేపట్లో ప్రయోగించనుంది. సునాయాసంగా చంద్రయానం చేసిన భారత్‌ను చూసి ఆశ్చర్యం ప్రకటించిన ప్రపంచ దేశాలు.. ఆదిత్య ప్రయోగాన్ని మరింత ఆసక్తిగా గమనిస్తున్నాయి. చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇస్రో.. PSLV_C 57 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. కౌంట్‌డౌన్‌ ముగియగానే ఆదిత్య ఎల్‌-1 నిప్పులు చిందుతూ ఎగరడానికి రెడీ అయ్యింది. 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రయాన్‌-3 విజయంతో శ్రీహరికోటలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొని ఉంది. ఆదిత్య మిషన్‌ ప్రయోగం నేపేథ్యంలో షార్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొదటి గేటు, రెండో గేటు వద్ద CISF సిబ్బంది వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. సూళ్లూరుపేట- శ్రీహరికోట మార్గంలో అవుట్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. PSLV_C 57 రాకెట్‌ ప్రయాణం నాలుగు దశల్లో కొనసాగనుంది. 44.4 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌ 138 టన్నుల బరువున్నట్లు ఇస్రో చెబుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్