Sunday, September 8, 2024

ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్దాలు మాయమాటలతో పరిపాలన ..: నాయిని రాజేందర్ రెడ్డి

- Advertisement -

హనుమకొండ (వాయిస్ టు డే): ప్రజాదీవన యాత్రలో భాగంగా మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ లో ని 60 వ డివిజన్ లో బృందావన్ అపార్ట్ మెంట్ నుండి ప్రారంభమై పోస్టాఫీసు వెనకాల, తెనగవాడ, గౌడవాడ, కుమ్మరివాడ, మిడిదొడ్డి వాడ, గర్జే స్కూల్ మీదుగా సాగి వడ్డేపల్లి వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ …
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రాగానే మాహలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం మరియు చేయూత ఈ 6 గ్యారంటీ స్కీం లను తక్షణమే అమలు చేస్తామని చెప్పారు
ఎం.ఎల్.ఏ. వినయ్ భాస్కర్ నిర్లక్ష్యంతో హన్మకొండ వాసులకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలా మారాయి.
మధ్యలోనే ఆగిన స్మార్ట్ సిటీ పనులు, అందుబాటులోని రాని నూతన అండర్ డ్రైనెజ్ వ్యవస్థ.
ఎం.ఎల్.ఏ. డివిజన్ లోనే డ్రైనేజ్ వ్యవస్త సరిగా లేదు. ఇంకా అతను ప్రజలకు ఏం చేస్తాడు
ఇతను ఇతని అనుచరులు చేసిన భూకబ్జాల వల్లనే మొన్నటి వరదల్లో హన్మకొండ నగరం మునిగింది.
వరదలతో అతలాకుతమైన ప్రజలకు ఆర్ధిక సహాయం అందించలేదు కనీసం వారిని పరామర్శించిన పాపాన పోలేదు.
నగరాన్ని అభివృద్ధి చేశాం అంటున్న ఎమ్మెల్యే ఒక్కసారి ఈ ముంపు ప్రాంతాలను సందర్శించి ఏం అభివృద్ధి చెందిందో చెప్పాలి.ఇదేనా మీ ప్రగతి ? అభివృద్ధి ?
నగరాభివృద్ధి కి ఏటా వంద కోట్లు ఇస్తాం అన్న సీఎం కెసిఆర్ హామీ ఏమైంది బీఅర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు.
కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రజల్లో తాము ఎక్కడ చులక అయితం అనే ఉద్దేశంతో నాపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీలో నన్ను అణగదొక్కాలని, నన్ను ధైర్యంగా ఎదుర్కొనలేక ఎం.ఎల్.ఏ. వినయ్ భాస్కర్ ఎన్నో కుట్రలు చేసాడు.
నాపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.
ఈ ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. కమీషన్లకు కక్కుర్తి పడుతూ అభివృద్ధి పనులలో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు.అధికారం కోల్పోతామనే భయంతో కొందరు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులుకు పాలపడుతున్న్నారు.
ప్రజా సమస్యలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు అనుకోటి పున్నం చందర్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అంబేద్కర్ రాజు, పులి రాజు, బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మా రెడ్డి, కొంటె సుకన్య, గదల, తాళ్ళపల్లి సుధాకర్, తాళ్ళపల్లి మేరీ, బి కుమార్ యాదవ్, నసీం జాహన్, డాక్టర్ పి రామకృష్ణ, కేతిడి దీపక్ రెడ్డి. అనిల్, ఎర్ర మహేందర్,ఎస్. కుమార్ యాదవ్, మహమ్మద్ ముస్తాక్ నేహాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్