పోలీసుల అదుపులో మహిళ అఘోరి.
Aghori woman in police custody.
రాజన్న జిల్లా
వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామన్న అఘోరి తన శపథం నెరవేర్చుకోవడంలో విఫలమైంది, ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని, తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో పోలీసులు ఆపివేశారు.
తను కారులో నుంచి దిగక పోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాద్ రూట్లో పోలీసులు తరలించారు.
దర్గాను కూల్చి వేస్తానని అఘోరి ముందే చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ పట్టణానికి నలువైపులా పోలీసులు మోహరించారు.
పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అఘోరీ వ్యవహారం, రోజు రోజుకు మితిమీరి పోతుంది, రోజు ఏదో ఒక ఊరికి వెళ్లడం స్థానికులతో గొడవ పడడం గ్రామస్తుల తో వాగ్వాదం పెట్టుకోవడం..రచ్చ రచ్చ చేయడంతో అఘోరి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.