Sunday, September 8, 2024

అమెరికా అబర్న్ యూనివర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ ఒప్పందం 

- Advertisement -

ప్రతీ యేటా ఇద్దరు ఎఫ్ సీఆర్ఐ విద్యార్థులకు పూర్తి ఫండింగ్ తో మాస్టర్స్ డిగ్రీ

అబర్న్ యూనివర్సిటీలో తెలంగాణకు హరితహారంపై ప్రజంటేషన్ ఇచ్చిన సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్

హైదరాబాద్: అమెరికా అలబామా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీ అబర్న్ లో ఫారెస్ట్రీలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం తెలంగాణ విద్యార్థులకు దక్కనుంది. ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) లో బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన విద్యార్థుల్లో ప్రతీ యేటా ఇద్దరికి ఎమ్సెస్సీ ఫారెస్ట్రీ కోసం పూర్తి ఫండింగ్ ఇచ్చేందుకు అబర్న్ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు అమెరికా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒప్పందం (MoU) కుదిరింది. అబర్న్ యూనివర్సిటీ ఫారెస్ట్రీ కాలేజీ డీన్ డాక్టర్ జానకి అలవలపాటి, తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సంవత్సరానికి ఇద్దరు చొప్పున ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫారెస్ట్రీలో ఎమ్మెస్ చదివేందుకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఆరేళ్ల పాటు అమల్లో ఉంటుందని వారు తెలిపారు. అబర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు విన్నీ నాథన్, డాక్టర్ క్రిస్టోఫర్ రాబర్ట్స్, బ్రెట్ వైట్, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Agreement of Telangana Forest College with Auburn University of America
Agreement of Telangana Forest College with Auburn University of America

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చొరవ, ముందుచూపుతో ప్రారంభించిన అటవీ కలాశాలకు నేడు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు, తెలంగాణ విద్యార్థులు అటవీ విద్యలో ఉన్నత చదువు, పరిశోధనలు, మంచి ఉద్యోగాల కల్పనకు ఈ ఒప్పందం దోహద పడుతుందని ప్రియాంక వర్గీస్ తెలిపారు. ఇందుకు సహకరించిన అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సీఎస్ (అటవీశాఖ) శాంతి కుమారి, పీసీసీఎఫ్ డోబ్రియాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే డీమ్డ్ హోదా పొందనున్న ఎఫ్ సీఆర్ఐ, ఈ తరహా ప్రత్యేకంగా ఫారెస్ట్రీ విద్యకోసమే నెలకొల్పిన యూనివర్సిటీగా ప్రపంచంలోనే మొదటిది అవుతుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్