మండలం లో ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్
AISF demand to set up AP Model School in Mandal
అఖిలభారత విద్యార్థి సమైక్య (AISF) ఆధ్వర్యంలో ఎమ్మార్వో వినతి పత్రం.
కౌతాళం
తాలూకా నాయకులు గురు మండల అధ్యక్షుడు సాయి వర్మ మాట్లాడుతూ కౌతాళం మండలంలో ఇప్పటివరకు ఏపీ మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేయలేదు ఏపీ మోడల్ స్కూల్ లేనందువలన ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అందువలన కౌతాళం మండలంలో ఏపీ మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామ్.
మంత్రివర్యులు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు యధావిధిగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. భోజన పథకాన్ని తొందరగా అమలయ్యే విధంగా చేయాలని తెలియజేస్తున్నాము. మరియు ఎస్సీ మరియు బీసీ హాస్టల్ లను ఏర్పాటు చేయాలని పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏ ఐ ఎస్ ఎఫ్
గా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్య కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శివశంకర్,మండల కో కన్వీనర్ కే నాగరత్న, మరియు మండల నాయకులు మహేష్ ఖాదర్ మరియు స్కూలు విద్యార్థులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.