బొగ్గుగనుల వేలానికివ్యతిరేకంగా ఏఐటియుసి.రిలే నిరాహారదీక్షలు.

- Advertisement -

బొగ్గుగనులవేలానికివ్యతిరేకంగా ఏఐటియుసి.రిలే నిరాహారదీక్షలు.
గోదావరిఖని
కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి పిలుపుమేరకు   ఆర్జీ వన్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీక్షలను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ దీక్షల్లో కూర్చున్న కార్మికులకు దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కు చెందిన నూతన బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం  సింగరేణి కి ఇవ్వకుండా వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, ఏఐటియుసి రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆద్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. 130 సంవత్సరాల చరిత్ర, కేంద్ర ప్రభుత్వం నూతన బొగ్గు గనులను ఇవ్వకుండా గుత్త పెట్టు బడి దారులకు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వేలం ద్వారా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థల కు ఇవ్వకుండా ప్రైవేటు వారికి ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించిందని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, వెంటనే బొగ్గు గనుల వేలం వేసే విదానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బొగ్గు గనుల వేలం పై రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని సింగరేణి కి ఇచ్చె విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బొగ్గు గనులను ప్రైవేటు వారికి ఇవ్వడం వల్ల సింగరేణి మూత పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక  వ్యతిరేక విధానాలను మానుకోకుంటే సింగరేణి లో అన్ని యూనియన్ లను,రాజకీయ పార్టీలను కలుపుకుని బొగ్గు గనుల్లో సమ్మె చేయడానికైనా ఏఐటియుసి సిద్ధమని ఆయన తెలిపారు. మొదటి రోజు రిలే నిరాహారదీక్షల్లో జిడికె వన్ ఇంక్లైన్ కార్మికులు 92 మంది పాల్గొన్నారు.ఈ నిరాహారదీక్షల ప్రారంభానికిముందుజి.ఎం.ఆఫీసు చౌరస్తా వద్ద ఉన్న అమరజీవి.మాదిరెడ్డి భాస్కర్ రావు విగ్రహానికి ఎల్లా గౌడ్, రంగు శ్రీనివాస్ లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ దీక్షలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఉపాధ్యక్షులు సంకె అశోక్, పిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్, పిట్ కమిటి నాయకులు ఉప్పులేటి తిరుపతి,‌ ఏగోళపు శంకరయ్య, నేరెళ్ళ తిరుపతి, సిర్ర మల్లికార్జున్, నంది నరేశ్, శేషాల మల్లయ్య, సురేష్ బాబు, కొప్పుల లింగయ్య, బి.నరేశ్, మేకల క్రాంతి కుమార్, కొరిమి శ్రావణ్ కుమార్, పోలు మల్లేశ్, సొతుకు క్రిష్ణ,మోరె సమ్మయ్య లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్  బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ రంగు శ్రీనివాస్ మాట్లాడగా, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినెష్, ఎం సంపత్, తాని రాజబాబు, ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్, చెప్యాల మహేందర్ రావు, బోడకుంట కనకయ్య, జనగామ జగదీశ్వర్, ల్వల జగన్ లు ప తమ సంఘీభావం తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular