రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్

- Advertisement -

ఆర్ఎస్ఎస్ వాది కాదని నిరూపించుకోవాలి

హైదరాబాద్:  తనకు ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదని చార్మినార్  భాగ్యలక్ష్మీ దేవాలయంకు వచ్చి ప్రమాణం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్ నాయకుల మాటలపై ఓవైసీ ఘాటుగా స్పందించారు. పాతబస్తీ బండ్లగూడలో సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీ టు పీజీ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేష నల్ క్యాంపస్ లో గురువారం రాత్రి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ అట్టహా సంగా ప్రారంభించారు. తమ తాత ముత్తాలు అందరూ భారతదేశం లోనే పుట్టామని, మరి సోనియాగాంధీ ఎక్కడ పుట్టిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. జాతీయ నాయకులతో పాటు చాయ్ వాలా అయినా మరో ,గాంధీ అయినా సరే తమ మాటలకు తిరుగుండదన్నారు. తాము ఎవరినీ కించపరుస్తలేమని, తమను కించపరిస్తే సహించేది లేదని హెచ్చ రించారు. బీజేపీ, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, శివసేన పార్టీలు ముస్లి ములకు శత్రువులు అన్నారు.

Akbaruddin Owaisi challenge to Revanth Reddy
Akbaruddin Owaisi challenge to Revanth Reddy
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular