అత్యధిక ఆదాయ పన్ను చెల్లించినది  అక్షయ్ కుమార్

- Advertisement -
Akshay Kumar paid the highest income tax
Akshay Kumar paid the highest income tax

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేసే ఆఖరి గడువు ముగిసిపోయింది. ఇప్పుడు అందరి మదిని తొలిచే ప్రశ్న ఏమిటంటే.. భారతదేశంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించింది ఎవరు? అని. చాలా మంది అపర కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ ఆదానీ, రతన్ టాటా అని అనుకుంటారు. కానీ అందులో వాస్తవం లేదు.స్టార్ టాక్స్ పేయర్..

భారతదేశంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించినది మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అవును మీరు చదువుతున్నది నిజమే. అధికారిక సమాచారం ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అక్షయ్ కుమార్ రూ.29.5 కోట్లు మేర ఆదాయపన్ను చెల్లించారు. ఈ టాప్ హీరో తన వార్షిక ఆదాయం రూ.486 కోట్లు అని ఐటీఆర్లో పేర్కొనడం గమనార్హం.బాలీవుడ్ కిలాడీ..

బాలీవుడ్ అని పిలుచుకునే హిందీ సినిమా ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ ఒక టాప్ స్టార్. అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఆయన కూడా ఒకరు. ప్రతి సంవత్సరం కనీసం 4-5 సినిమాలు చేస్తుంటారు అక్షయ్ కుమార్. అందువల్ల ఆయనకు మంచి ఆదాయమే వస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular