- Advertisement -
యువకుడిని చితక్కొట్టిన అక్వా రైతులు
Akwa farmers who crushed the young manఅమలాపురం
ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఒక యువకుడిని స్తంభానికి కట్టి ఆక్వా రైతులు చితక్కోట్టారు. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. గ్రామంలో ఆక్వా చెరువుల తవ్వకాల పర్యావరణ తోపాటు నీట కాలుష్యం అవుతుందని కోర్టుకు వెళ్లాడు. దాంతో కోర్టు చెరువులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ చెరువుల తవ్వే ప్రయత్నం ఆక్వా రైతులు చేసారు. వీర దుర్గాప్రసాద్ ఆధికారులను ఆశ్రయించాడు. అధికారులు ఫోటోలు పంపమనడంతో చెరువుల దగ్గరకు వెళ్ళిన వీర దుర్గాప్రసాద్ ను స్తంభానికి కట్టి ఆక్వా రైతులు చెతక్కొట్టారు. బాధితుడు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- Advertisement -




