Tuesday, May 19, 2026

అలకానంద హాస్పటల్ సీజ్..కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు

- Advertisement -

అలకానంద హాస్పటల్ సీజ్..కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు

Alakananda Hospital Siege..Kidney Racket Gang Guttu Rattu

హైదరాబాద్

రాష్ట్ర రాజధానిలో కిడ్నీ రాకెట్‌ కలకలం రేపింది రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సరూర్‌ నగర్‌లోని అలకనంద ప్రైవేట్‌ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో గుట్టు రట్టయింది.
ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నా రు. హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడులు చేస్తున్న ఆసుపత్రిపై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
సరూర్‌నగర్‌ లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆసుపత్రి లోపల నలుగురిని గుర్తించిన పోలీసులు వారికి కిడ్నీ శస్త్ర చికిత్స జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
వారిలో ఇద్దరు దాతలుగా భావిస్తున్నారు. మరో ఇద్దరు గ్రహీతలుగా భావిస్తున్నారు. వీరు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరు ఈ నెల 17 న ఆసుపత్రిలో చేరినట్టు అధికారులు తెలిపారు. వారిని ప్రశ్నించగా తాము కిడ్నీలో రాళ్లు తీసుకోవడానికి వచ్చినట్టు తెలిపారు.
కానీ అధికారుల పరిశీలనలో మాత్రం వారికి కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమ య్యాయి. నలుగురికి కిడ్నీ మార్పిడి జరిగిందా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్దారించేం దుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అలకనంద ఆసుపత్రి గత ఆరు నెలల కింద ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఉండగా ఇది తొమ్మిది పడకల ఆసుపత్రిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ కిడ్నీ శస్త్ర చికిత్సలు వంటి వాటికి అనుమతి లేదని గుర్తించారు. అయినప్పటికీ అక్రమంగా డబ్బు ఆశ చూసి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం ఆసుపత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఆసుపత్రి ఇన్‌చార్జితో పాటు మరొకొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆసుపత్రి పై కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.
కిడ్నీ రాకెట్‌ వ్యవహారం నగరంలో చర్చనీయాం శంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్