Sunday, February 9, 2025

నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు.

- Advertisement -

నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు.

Albendazole tablets for deworming.

జయశంకర్ భూపాలపల్లి,

నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పని సరిగా  వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న తీసుకొని వారికి తిరిగి  17 వ తేదీన అల్బెండజోల్ మాత్రలు  ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 69,652 మంది పిల్లలు గుర్తించడం జరిగిందని జిల్లాలోని అన్ని
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యాధికారి నుండి మొదలు కొని ఆశా సిబ్బంది వరకు డి వార్మింగ్ డే  లో భాగస్వాములు కావాలని ఆదేశించారు. చిన్నారులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణ లో మాత్రమే మాత్రలు ఇవ్వాలని పేర్కొన్నారు.
పంచాయతీ అధికారులు గ్రామాలలో టామ్ టామ్ వేయించి అల్బెండజోల్ మాత్రల వాడకం గురించి విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించాలని సూచించారు.  గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పిల్లలకు, వివిధ కారణాల వల్ల ఇంటి వద్ద ఉన్న పిల్లలను గుర్తించి మాత్రలు అందించాలని తెలిపారు. 1 నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ట్యాబ్లెట్లును పిండి చేసి అందించాలని, 3 నుండి 19 సంవత్సరాల పిల్లలకు నేరుగా ట్యాబ్లెట్లు అందించాలని తెలిపారు. కడుపులో నులిపురుగుల ఉండటం వల్ల తిన్న ఆహారం వంటబట్టక పిల్లలు రక్త్ హీనతను గురవుతారని మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగుల చనిపోతాయని, ఆహారం మంచిగా జీర్ణం అయి పిల్లల ఎదుగుదల బావుంటుందని తెలిపారు. అనంతరం మాతా శిశు వైద్య ఆరోగ్య సేవలు, ప్రభుత్వ  ఆసుపత్రులలో ప్రసవాలపై గర్భిణీలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గర్భిణీ సగటున రోజుకు తీసుకోవేయాల్సిన ఆహార నియమాలు తెలుపాలని అన్నారు.   పిండం వృద్ధికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు గర్భిణీలకు తెలియచేయాలని స్పష్టం చేశారు.  ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్ల ద్వారా గర్భిణుల, శిశువుల ఆరోగ్యం అలాగే  బాలింతలు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన  శిశు జననానికి అవగాహన కల్పించాలని సూచించారు. ఎప్పటి కపుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మాతా, శిశు మరణాలు జరగకుండా చూడాలని,  ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి,  ప్రోగ్రాం అధికారులు డాక్టర్  శ్రీదేవి, ఉమాదేవి, చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం అధికారి డా ప్రమోద్ వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్