Saturday, December 21, 2024

ఆల్ ఇన్ వన్ సొల్యూషన్స్ కు… సిపిగ్రామ్స్

- Advertisement -

ఆల్ ఇన్ వన్ సొల్యూషన్స్ కు… సిపిగ్రామ్స్

All-in-one solutions to... Cipgrams

ముంబై, డిసెంబర్ 17, (వాయిస్ టుడే)
ప్రతీ పనికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే కూడా సాంకేతికాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందురు పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలన్నా నేరుగా స్టేషన్ కు వెళ్లకుండా ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు.జీవితం అంటేనే కష్ట సుఖాలమయం. కష్టాల్లో కొన్ని చెప్పుకునేవి..మరికొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అయితే పర్సనల్ విషయాలను చెప్పుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి మార్గాలు ఉండొచ్చు. కానీ కొన్ని అవసరాలు తీరాలంటే మరొకరితో సంబంధం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని పరిస్థితులు వారికి అనుగుణంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్, కరెంట్, పెట్రోల్ ఇతర విషయాల్లో కొన్ని సార్లు ఇబ్బందులు కలుగుతాయి. కానీ వీటి పరిస్కారానికి ఒక్కోసారి ఎవరూ సహకరించరు. ఇలాంటి సమయంలో సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరు. కానీ ఓ వెబ్ సైట్ కు కంప్లయింట్ చేయడం వల్ల సమస్య కచ్చితంగా పరిష్కారం అవుతుంది అని అంటున్నారు. కాలం మారుతున్న కొద్దీ టెక్నీలజీ పుంజుకుంటోంది. దీంతో ప్రతి పనిని సాంకేతికంగా చేస్తున్నారు. మొబైల్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వాడకం పెరిగి ప్రతీ విషయం ఆన్ లైన్ ద్వారా తెలుసుకుంటున్నారు. ప్రతీ పనికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే కూడా సాంకేతికాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందురు పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలన్నా నేరుగా స్టేషన్ కు వెళ్లకుండా ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు.అలాగే నిత్యావసరాల్లో కొన్ని సమస్యలు ఏర్పడినప్పుడు సంబంధిత వ్యక్తులకు ఫిర్యాదు చేయడం వల్ల పట్టించుకోవడం లేదు. కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగినా పరిష్కారం కానివి ఎన్నో ఉన్నాయి. అయితే వీటిని నేరుగా ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. అయితే సమీపంలోని అధికారులే పట్టించుకోవడం లేదు… ప్రధాని ఎలా పట్టించుకుంటారనే సందేహం రావొచ్చు.. కానీ పీఎంవో కార్యాలయానికి వచ్చిన కొన్ని సమస్యలు కచ్చితంగా పరిష్కారించాలన్న రూల్ కూడా ఉంటుంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఆన్ లైన్ ద్వారా ఈ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అదెలాగంటే?ముందుగా గూగుల్ లోకి వెళ్లి.. సిపిగ్రామ్స్ అని టైప్ చేయాలి. ఇప్పుడు ముందుగా వచ్చిన వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు బ్లూ కలర్ లో ఉన్న ఒక పేజీ వస్తుంది. ఇందులో గ్రీవెన్స్ సెల్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ అది పరిష్కారం కావడం లేదో.. దాని గురించిన వివరాలు అందించాలి. సంబంధిత డాక్యుమెంట్ ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పీఎంవో కార్యాలయానికి వెళ్తుంది. దీనిపై కచ్చితగా పరిశీలన చేసి ఆ తరువాత సమస్య పరిస్కారం కోసం ఆలోచిస్తారు.ప్రస్తుతం అంతా టెక్నాలజీమయం కావడంతో ఈ వెబ్ సైట్ ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యగా కళాశాల, ప్రభుత్వ కార్యాలయాలు లేదా కొందరు వేధింపులకు గురిచేసే సమస్యలు ఉన్నా.. వెంటనే పరిష్కారం దిశగా కృషి చేస్తారు. ఈ కంప్లయింట్ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు. అయితే ఎలాంటి సమస్య ఉందో దాని గురించి కచ్చితంగా వివరాలు అందించాల్సి ఉంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్