- Advertisement -
బహిరంగ సభకు బయలుదేరిన అళ్లగడ్డ ముస్లీం సోదరులు
Allagadda Muslim brothers who left for the public meeting
ఆళ్లగడ్డ
జమయితే హింద్ ఉలమా పిలుపుమేరకు కడపలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఆళ్లగడ్డ పట్టణం నుండి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాళ్ళ భాషా ఆధ్వర్యంలో 16 కార్లు, 8 లారీలు, 14 ఆటోలలో ముస్లిం సోదరులు బహిరంగ సభకు తరలి వెళ్లారు.. రాజ్యాంగ పరిరక్షణ, వగ్బోర్డు ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలపై నేడు జరగనున్న భారి బహిరంగ సభకు ముస్లిం సోదరులు తరలి వెళ్లారు. ఈ భారీ బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారని అంచనా..కాగా బహిరంగ సభకు వెళ్తున్న వాహనాలకు ప్రముఖ సామాజిక కార్యకర్త జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాళ్ళ భాష మరియు ఉలమాల సంఘం నాయకులు మౌలానా రఫీ జండా ఊపి వాహనాలను తరలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బరుగొడ్ల హుస్సేన్ భాష, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గౌస్ పీర్, మసీవుల్లా, షేర్ షాషావలి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -