- Advertisement -
అల్లు అర్జున్ అరెస్ట్…
Allu Arjun Arrested
14 రోజుల రిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 13, (వాయిస్ టుడే)
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప2 సినిమా సక్సెస్‌తో ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్న అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారు. సంథ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈనెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలాగే తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇదే విషయంలో గురువారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ వేశారు అల్లు అర్జున్. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈలోగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవంతి అనే మహిళ చనిపోయింది. అయితే ఈ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్. రేవతి గారి ఫ్యామిలీకి అల్లు అర్జున్ సంతాపం తెలియజేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి 25లక్షలు అందిస్తానని చెప్పారాయన.
నమోదైన సెక్షన్ల వివరాలు..
– 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు
– 105 సెక్షన్ కింద ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం
– BNS 118 (1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం
పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం.. అరెస్టుకు ముందు హైడ్రామా..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.. డిసెంబర్ నాలుగో తేదీన బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది.. ఆమె కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అయితే.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో హైడ్రామా నెలకొంది.. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తంచేశారు.. దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు.. పోలీసులు నేరుగా ఇంట్లోకి రావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.. ఇది టూమచ్ అంటూ పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీసుకెళ్లడం తప్పుకాదని.. అరెస్టు చేయడం తప్పుకాదని.. కానీ.. డ్రెస్ కూడా మర్చుకోనివ్వరా.. ? టు మచ్ .. ఇది మంచి విషయం కాదంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు.అల్లు అరవింద్ కూడా అర్జున్‌తోపాటు పోలీస్ వాహనం ఎక్కడంతో.. వద్దని వారించిన బన్నీ. దీనికి సంబంధించి ఏం జరిగినా.. అది మంచైనా, చెడైనా అంతా నాదేనంటూ తండ్రిని అల్లు అర్జున్ పోలీస్ వాహనం నుంచి దించేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పోలీసులు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ రెడీ అనంతరం పోలీసులు అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది.. అయితే ఈ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్. రేవతి గారి ఫ్యామిలీకి అల్లు అర్జున్ సంతాపం తెలియజేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి 25లక్షలు అందిస్తానని చెప్పారాయన. అయితే అల్లు అర్జున్‌తో పాటు సంధ్య యాజమాన్యం అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బందిపై కేసు నమోదైంది. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు
కన్నీళ్లు పెట్టిన స్నేహ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది.. అయితే ఈ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్. రేవతి గారి ఫ్యామిలీకి అల్లు అర్జున్ సంతాపం తెలియజేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి 25లక్షలు అందిస్తానని చెప్పారాయన. అయితే అల్లు అర్జున్‌తో పాటు సంధ్య యాజమాన్యం అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బందిపై కేసు నమోదైంది. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేయడంతో స్నేహరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రావడంతో టెన్షన్ పడిన స్నేహారెడ్డి. భార్య భుజం తట్టి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్.డిసెంబర్ 4, రాత్రి 9గంటలకు హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగింది. గేట్ దగ్గరకు జనాలు చొచ్చుకురావడంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇంకా చికిత్స పొందుతున్నారు.
రిమాండ్ కుతరలింపు
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప(సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా సీక్వెల్ గా దాదాపు మూడేళ్ల కష్టం తర్వాత ‘పుష్ప -2’ సినిమా విడుదల చేశారు. అయితే విడుదలైన తర్వాత కష్టానికి ప్రతిఫలం లభించింది. ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఆ ఆనందం మాత్రం ఒక్కరోజు కూడా నిలవలేదని చెప్పాలి. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో ఆయనకు బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. కానీ నాంపల్లి కోర్టులో విచారణ జరపగా 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీన్నిబట్టి చూస్తే ఈరోజు నుంచి 14 రోజుల వరకు అల్లు అర్జున్ జైలు జీవితం గడపబోతున్నారు. అటు అల్లు అరవింద్, ఇటు చిరంజీవిఎంతగానో ప్రయత్నం చేశారని , కానీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు జైలు జీవితం గడవబోతున్నారని తెలిసి అభిమానులు సైతం ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షోలు వేశారు. హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో సినిమా చూడడానికి పెద్ద ఎత్తున ఆడియన్స్ వచ్చారు. అయితే అదే రోజు ఆ థియేటర్లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా వచ్చారు. అల్లు అర్జున్ ని చూడడానికి అభిమానులు ఎగబడగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 39 సంవత్సరాల రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సీపీఆర్ చేసినా సరే ఫలితం లేకపోవడంతో బాలుడిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పైన అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన రేవతి భర్త భాస్కర్ మాత్రం.. అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్టు కావడానికి తనకు ఎటువంటి సంబంధం లేదని, అల్లు అర్జున్ పై పెట్టిన కేసును తాను విత్డ్రా చేసుకుంటానని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిందని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.
- Advertisement -